వైసీపీకి షాకిచ్చిన షర్మిల.. ఈ రేంజ్ కౌంటర్ ఎవ్వరూ ఊహించలేదు

Update: 2022-12-09 04:50 GMT
ఏపీ, తెలంగాణను మళ్లీ కలుపాలంటూ వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించాయి. దీనికి ఆఖరుకు ఆంధ్రా ఆడకూతురు.. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా  కౌంటర్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని మాట్లాడిన మాటలను తప్పుపట్టింది. విభజనను "అనైతికం" అని సజ్జల అభివర్ణించాడాన్ని ఖండించింది.  

విభజనను వైఎస్సార్‌సీపీ గట్టిగా వ్యతిరేకిస్తోందని, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలను మళ్లీ కలపాలనే ఆలోచనను వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ స్వాగతిస్తున్నదని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి గట్టిగా పోరాడుతామని సజ్జల సంచలన ప్రకటన చేశారు.

వేలాది మంది అమరవీరుల నిస్వార్థ త్యాగాలు , దశాబ్దాల తిరుగుబాటు కారణంగా ఏర్పడిన తెలంగాణలో సజ్జల వ్యాఖ్యలు చాలా మంది తెలంగాణ ప్రజలను కదిలించాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక సజ్జలకు అత్యంత ఆశ్చర్యకరమైన ఎదురుదెబ్బ తగిలింది. సీఎం జగన్ చెల్లెలు.. వైఎస్‌ఆర్‌టీపీ నేత వైఎస్‌ షర్మిల నుంచి అదిరిపోయే కౌంటర్ వచ్చింది. సజ్జల వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఏపీ మరియు తెలంగాణలను తిరిగి కలపడం "అశాస్త్రీయమైనది" అని అభివర్ణించారు. "తెలంగాణ ఇప్పుడు వాస్తవం. ఎంతో మంది ప్రజల త్యాగాల ఫలితమే తెలంగాణ. తెలంగాణ చరిత్రలో మరువలేని అధ్యాయం" అని షర్మిల అన్నారు.

"విభజించిన రెండు రాష్ట్రాలను తిరిగి కలపడం గురించి మీరు (సజ్జల) ఎలా ఆలోచించగలరు? మీరు మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి తప్ప రెండు రాష్ట్రాలను తిరిగి కలపడంపై కాదు. మీ హక్కుల కోసం పోరాడండి.

మీ రాష్ట్రానికి న్యాయం చేయండి, కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచవద్దు ”అని షర్మిల సజ్జలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.  నిజమైన  తెలంగాణవాదిగా షర్మిల మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News