• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎవరా ఇద్దరు కుర్ర...

ఎవరా ఇద్దరు కుర్ర ఎమ్మెల్యేలు

By - Tupaki Desk
Update: 2017-02-04 18:27 GMT
ఏపీలో మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. రెండు రోజుల కిందట చంద్రబాబు స్వయంగా చెప్పిన మాటతో లోకేశ్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమని తేలిపోయింది.. యువరాజుతో పాటే మరికొందరికీ ఛాన్సు ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా యువత నుంచి మరో ఇద్దరికి ఛాన్సు రావచ్చని భావిస్తున్నారు. ఆ లక్కీ ఛాన్సు అందుకునే కుర్ర ఎమ్మెల్యేలు ఎవరన్నది తెలియాల్సి ఉంది.
    
కార్యకర్త ల సంక్షేమనిధికి సంబంధించి మాట్లా డుతున్న సందర్భంలో లోకేష్‌ కు మరింత కీలక బాధ్యతల అప్పగించాలంటూ కొందరు పార్టీ నేతలు చేసిన సూచనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిం చడంతో ఇక కేబినెట్‌ లో లోకేష్‌కు స్థానం ఖాయమని తేలిపోయింది.  అయితే కేబినెట్‌ విస్తరణ కేవలం లోకేష్‌ చేరికవరకే పరిమితమౌతుందా లేగా ఏకమొత్తంగా పునర్‌ వ్యవస్ధీకరణ చేస్తారా అన్న దానిపై ఇప్పుడు విస్తృతంగా ప్రచారం మొదలైంది. ఇప్పటికే కొందరు మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు మాసాల క్రితమే వీరిని తప్పించాలని భావించినప్పటికీ రాష్ట్రంలో పరిస్థితులింకా పూర్తిగా కుదుటపడకపోవడంతో పార్టీలో కొత్త అసమ్మతిని రాజేయడం సరికాదని చంద్రబాబు భావించారు. ఈ ప్రతిపాదనల్ని వాయిదావేసుకున్నారు. కాగా కొందరుమంత్రులు విపక్షాల ఆరోపణలపై సమర్దవంతంగా స్పందించడంలేదు.. వాటిని తిప్పికొట్టడంలో ఎలాంటి ఆసక్తి ప్రదర్శించడంలేదు. ముగ్గురు నలుగురు మంత్రులపైనే ఈ బాధ్యత పడుతోంది. ఇటీవల విపక్షాల తాకిడి పెరిగింది. గతంలో స్వపక్షంగా ఉన్న జనసేన కూడా ఇప్పుడు తెలుగుదేశాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు మొదలెట్టింది. అయితే మిత్రత్వం చెడిపోకుండా.. అలాగని ఆరోపణలకు బలం చేకూర్చకుండా వీటిపై వివరణలతో  కూడిన ఖండనలను ఇచ్చేందుకు ఎవరూ ముందుకురావడంలేదు. కీలక పదవుల్లో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి స్థాయిలో నిత్యం ప్రగతి, అభివృద్ధి ప్రకటనలు తప్ప సమర్ధవంతంగా రాజకీయ దాడిని తిప్పికొట్టడంలేదన్న అసంతృప్తి అధిష్టానంలో కనిపిస్తోంది.
    
మరోవైపు కొందరు మంత్రులు శాఖాపరంగానూ వైఫల్యాలను అధిగమించలేకపోతున్నారు.  ఇదే బృందంతో వచ్చే ఎన్నికల్ని ఎదుర్కొంటే ఫలితాలు అంత సానుకూలంగా ఉండవన్న ఆందోళన కూడా పార్టీలో వ్యక్తమౌతోంది. కనీసం ముగ్గురు, నలుగురినైనా మార్చాలన్న సూచనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగానే ఇటీవల చంద్రబాబు కొందరు మంత్రుల్ని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శాఖల వారీగా మంత్రుల పనితీరును వివిధ మార్గాల్లో ముఖ్యమంత్రి సమీకరించారు. వీటన్నింటిని క్రోడీకరించి వారి పనితీరుకు గ్రేడ్‌లిచ్చారు. అటు ప్రభుత్వం.. ఇటు పార్టీ రెండింటిని సమన్వయం చేసుకుంటూ భవిష్యత్‌ రాజకీయ ప్రయోజనాల్ని కూడా పరిరక్షించగలిగే వార్ని మాత్రమే కొనసాగించాలని ఆయన భావిస్తున్నారు. ఒత్తిళ్ళు, మొహమాటాలు, అంతర్గత అసమ్మతులకు తలొగ్గితే అసలుకే ఎసరొస్తుందన్న భయం కూడా పార్టీ అధిష్టానంలో ఏర్పడినట్లు సం కేతాలొస్తున్నాయి. దీంతో లోకేష్‌తో పాటు కనీసం మరో ఇద్దరు ఔత్సాహికులకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
    
ఉత్తరాంధ్రకు చెందిన ఒక మహిళా మంత్రి పనితీరు ముఖ్యమంత్రిని సంతృప్తిపర్చలేక పోతోంది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు కేబినెట్లో స్థానం కోసం పట్టుబడుతున్నారు. అలాగే గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి తీరుపట్ల ముఖ్యమంత్రి బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. కర్నూల్‌ జిల్లాలో వైకాపా నుంచి పార్టీలోకొచ్చిన భూమా నాగిరెడ్డి కుటుంబం నుంచి ఒకరికి మంత్రిపదవివ్వాలని డిమాండ్‌ చేస్తున్నప్పటికీ  చంద్రబాబు దీనిపై ఇంకా స్పష్టతకు రాలేదని టాక్.
    
నిబంధనల మేరకు కేబినెట్‌ లో మరో ముగ్గురు వరకు అవకాశాలున్నాయి. అయితే కొందర్ని తప్పించి అదనంగా ముగ్గురికి అవకాశం కల్పిస్తే కొత్తగా ఐదునుంచి ఆరుగురికి మంత్రిపదవులొచ్చే అవకాశాలుంటాయి. ఏదైనా మండలి ఎన్నికల అనంతరమే ఈ ప్రక్రియ మొదలెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పెండింగ్‌లో ఉన్నే మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టిల ఎన్నికలకు ముందే మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ చేపట్టాలా లేక వాటి ఫలితాల అనంతరం ఈ దిశగా ప్రయత్నించాలా అన్నదానిపై ఇంకా ఇతమిద్దంగా తేల్చుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Young MLAs 
  • Andhra Cabinet 

Similar News

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Copyright @2026

Powered by Blink CMS