• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబును అడ్డుకున్నది...

చంద్రబాబును అడ్డుకున్నది ఎవరు ?

By - Tupaki Desk
Update: 2021-03-02 06:30 GMT
ఇపుడిదే ఆంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  అధికారపార్టీ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున చిత్తూరు, తిరుపతిలో  ఆందోళన చేయాలని తెలుగుదేశంపార్టీ నిర్ణయించింది. తమ ఆందోళనలకు అనుమతివ్వాలంటూ రెండు చోట్లా టీడీపీ నేతలు ఎస్సీలను అనుమతి అడిగారు. అయితే ఎస్పీలు అనుమతి నిరాకరించారు. తిరుపతిలో బస్టాండ్-రైల్వేస్టేషన్ మధ్యలో ఉన్న గాంధి విగ్రహం బాగా రద్దీగా ఉండే ప్రాంతం. అలాగే చిత్తూరులో గాంధి ఏరియా అంటే పట్టణంలో బాగా జనసమ్మర్ధం ఉండే ఏరియా. కాబట్టి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. పై రెండు మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కాబట్టి ఆందోళనలు, నిరసనలకు అనుమతులు ఇవ్వటం కుదరదని ఎస్పీలు స్పష్టంగా చెప్పారు. అయినా వినకుండా చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. దాంతో చంద్రబాబును పోలీసులు విమానాశ్రయం లాంజ్ లోనే అడ్డుకున్నారు. దాంతో మండిపోయిన చంద్రబాబు పోలీసులపై నోటికి పనిచెప్పారు.

చంద్రబాబు, అచ్చెన్నాయుడు అండ్ కో ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. ప్రాధమిక హక్కులు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటు చంద్రబాబు పోలీసులను నిలదీశారు. తనను అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదంటు మండిపోయారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. తనను పోలీసులు అడ్డుకున్నందకు నిరసనగా లాంజ్ లోనే మధ్యాహ్నం నుండి కూర్చుని నిరసన తెలుపుతున్నారు.

 అంతా బాగానే ఉంది చంద్రబాబు నిలదీయాల్సింది ఎన్నికల కమీషన్నే కదా. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. స్టేట్ ఎలక్షన్ కమీషన్ ఆదేశాల ప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంతవరకు పోలీసులు కమీషన్ పరిధిలోనే పనిచేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. మరి అన్నీ విషయాలు తెలిసిన చంద్రబాబు, అచ్చెన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆడిపపోసుకోవటంలో అర్ధమేంటి ? చంద్రబాబును అడ్డుకున్నది ఎన్నికల కమీషనే కానీ ప్రభుత్వం కాదు. మరి చంద్రబాబు అండ్ కో ప్రభుత్వంపై మండిపడితే ఉపయోగమేంటి ?
Tags:    
  • Chandrababu 
  • Telugu Desam 
  • Municipal Elections 
  • Ys Jagan 
  • Andhra Pradesh 
  • Telugu News 

Similar News

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

Copyright @2026

Powered by Blink CMS