• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోరిస్​, పాండ్యా మధ్య...

మోరిస్​, పాండ్యా మధ్య మాటల యుద్ధం.. ఐపీఎల్​ నిర్వాహకుల మందలింపు

By - Tupaki Desk
Update: 2020-10-30 11:30 GMT
ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్​లో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు  చేసుకున్నాయి. ఈ మ్యాచ్​లో సూర్యకుమార్​ చెలరేగి ఆడటంతో ముంబయి జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబయి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ హార్దిక్ పాండ్యా  క్రీజ్​లో ఉన్నాడు. ఆ సమయంలో బెంగళూరు బౌలర్ క్రిస్ మోరిస్ కు హార్థిక్​ కు మధ్య చిన్న వివాదం చెలరేగింది. 19వ ఓవర్లో మోరిస్ విసిరిన బంతికి పాండ్యా  సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత మోరిస్​ ఏదో సైగ చేశాడు. దీంతో పాండ్యా కూడా అతడితో ఘర్షణకు దిగాడు. ఆ మరుసటి బంతికే మోరిస్ పాండ్యాను అవుట్ చేశాడు. అప్పడు మోరిస్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది.

కోహ్లీ కల్పించుకొని ఇద్దరికి సర్ది చెప్పాడు. హార్దిక్ మాత్రం మోరిస్ దే తప్పు అన్నట్లుగా చేతులతో చూపించాడు. అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. హార్దిక్ అవుట్ అయ్యాక వచ్చిన పోలార్డ్ ఒక ఫోర్ కొట్టగా.. ఆ తర్వాతి ఓవర్ లో సూర్య కుమార్ యాదవ్ మ్యాచ్ ను ముగించాడు.

ఈ సంఘటనను అంపైర్లు మ్యాచ్ ముగిసిన తర్వాత ఐపీఎల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్ళడంతో వారు  పాండ్యా, మోరిస్ లను పిలిపించి వివరణ కోరారు. తాము నిబంధనలు ఉల్లంఘించినట్టు ఇరువురూ అంగీకరించడంతో మందలింపుతో సరిపెట్టారు. వారికి ఎలాంటి జరిమానా విధించలేదు. నిబంధనలు ఉల్లంఘించినట్లు క్రిస్ మోరిస్, హార్దిక్ పాండ్యా ఒప్పుకొన్నారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1-2.5ను మోరిస్.. లెవల్ 1-20ను పాండ్యా అతిక్రమించాడు.దీంతో కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 బ్రీచ్ కింద మ్యాచ్ రిఫరీ ఇద్దర్నీ మందలించారు.
Tags:    
  • IPL 
  • IPL 2020 
  • IPL Matches 
  • IPL 2020 Updates 
  • IPL Latest Updates 
  • BCCI 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS