• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విశాల హృదయంలో ఆయనకూ...

విశాల హృదయంలో ఆయనకూ చోటూ.. వైసీపీకి షాక్....?

By - Tupaki Desk
Update: 2022-12-20 09:30 GMT
తెలుగు తమిళ హీరో అందరికీ పరిచయమే. ఆయన్ సినిమాలు పొగరు, పందెం కోడి వంటివి తెలుగుద్లో  మంచి విజయాన్ని నమోదు చేసాయి. స్వతహాగా తెలుగువాడు అయిన విశాల్ తమిళ సీమకు వెళ్లి అక్కడ నెగ్గుకు వస్తున్నాడు. కోలీవుడ్ లోని నడిగర్ సంఘం ఎన్నికల్లో కూడా ఆయన పాలుపంచుకుని ప్రముఖుడిగా నిలిచారు.

విశాల్ ఇపుడు తెలుగువారికి హీరోగానే కాదు ఒక రాజకీయ నేతగా కనిపించబోతున్నారా అంటే అది ఇపుడు ఆసక్తికరమైన చర్చగానే ఉంది. రాజకీయం అంటేనే అనూహ్యం. ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. అయితే విశాల్ మావాడు మా అభ్యర్ధి కుప్పం సీటు నుంచి కాబోయే ఎమ్మెల్యే అని వైసీపీ జబ్బలు చరచుకుంటోంది. కానీ వైసీపీ కి షాక్ ఇచ్చేలా విశాల్ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు.

తనకు జగన్ అంటే ఇష్టం. అది రాజకీయాల  వరకూ ఉంది. కానీ తనకు పవన్ కళ్యాణ్ అంటే కూడా చాలా ఇష్టమని విశాల్ చెబుతూ వైసీపీకి గట్టి షాక్ ఇచ్చేశారు. నిజానికి ఏపీలో పవన్ వైసీపీకి కొరకరాని కొయ్యలా మారారు. ఆయన్ని విమర్శించడమే తప్ప మరో మాటే వైసీపీకి లేకుండా పోతోంది. అలాంటి టైం లో విశాల్ మావాడు అని వైసీపీ చెప్పుకుంటూ మాకూ ఒక హీరో దొరికాడు అని మురిసిపోతున్న టైం లో విశాల్ నోటి నుంచి పవన్ గ్రేట్ అన్న మాటలు రావడం అంటే తట్తుకోవడం కష్టమే.

మరి ఆయన్ని పిలిచారో లేక ఆయనే జగన్ అపాయింట్మెంట్ కోరారో తెలియదు కానీ సీఎం అపాయింట్మెంట్ భేటీ అంటూ వార్తలు వస్తున్న టైం లో పవన్ని విశాల్ పొగడడం అంటే అది కచ్చితంగా ఫ్యాన్ పార్టీకి మింగుడుపడని వ్యవహారమే అంటున్నారు. ఇక విశాల్ పవన్ గురించి చాలానే చెప్పారు. పవన్ ది ఒక ప్రత్యేకమైన స్టైల్ అని, ఆయన నటన, ఆయన ఇమేజ్ వేరు అని కూడా కితాబు ఇచ్చారు. సినిమాల వరకూ తాను పవన్ ఫ్యాన్ ని అని చెప్పేసుకున్నారు.

మరి వైసీపీ వారు దీన్ని ఎలా చూస్తారో ఎలా అర్ధం చేసుకుంటారో ఆలోచించాల్సిందే. పవన్ కళ్యాణ్ తనకు తాను హీరో కాక ముందు నుంచి తెలుసు అని ఆయన గ్రేట్ అని విశాల్ అనడం ఆయన విశాల హృదయానికి ఉదాహరణ కావచ్చేమో కానీ విని తట్టుకునే విశాల హృదయం వైసీపీ వారికి ఉందా అన్నదే పెద్ద డౌట్. ఏది ఏమైనా విశాల్ జగన్ నా పొలిటిక్ హీరో అంటున్నారు. పవన్ని తన సినిమా హీరో అంటున్నారు. ఇలా అటు వైసీపీ ఇటు జనసేనలు రెండింటికీ సమ న్యాయం చేశారు కానీ దాన్ని ఆ రెండు పార్టీలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని అంటున్నారు. మొత్తానికి  విశాల్ చాలా ఆచీ తూచీనే మాట్లాడారు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Vishal 
  • Chennai 
  • Andhrapradesh 
  • Tollywood 
  • Kollywood 
  • PawanKlayan 
  • YSRCP 
  • JaganMohanReddy 
  • Oppointment 
  • LatestNews 
  • Politics 
  • PoliticalNews 
  • TupakiNews 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS