• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వారం రోజుల్లో 2 లక్షల...

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

| కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ‘Belonging: A Journey of Love’ పుస్తకానికి మంచి స్పందన లభిస్తోంది. నవంబర్ 10న అమ్మకాలు ప్రారంభమైన ఈ పుస్తకం తొలి వారంలోనే 2 లక్షలకు పైగా కాపీలు అమ్ముడైనట్లు ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ ఇండియా వెల్లడించింది. ఇందులో తన బాల్యం, ఇటలీ నుంచి భారత్‌కు ప్రయాణం, రాజీవ్ గాంధీతో వివాహం, రాజకీయ ప్రస్థానం గురించి సోనియా వివరించారు.

By - Tupaki Desk
Update: 2026-11-18 07:06 GMT

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన పుస్తకం ‘Belonging: A Journey of Love’ అమ్మకాల్లో మంచి జోరు చూపిస్తోంది. నవంబర్ 10న మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకాన్ని నవంబర్ 16న న్యూఢిల్లీలో అధికారికంగా విడుదల చేశారు.

పుస్తకం అమ్మకాలు మొదలైన వారం రోజుల్లోనే రెండు లక్షలకు పైగా కాపీలు అమ్ముడయ్యాయని ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రకటించింది. సంస్థ సీఈఓ అనంత్ పద్మనాభన్ ఈ విషయాన్ని పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వెల్లడించారు.

ఈ పుస్తకంలో సోనియా గాంధీ తన చిన్ననాటి జీవితం, ఇటలీ నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణం, రాజీవ్ గాంధీతో వివాహం, రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలను వివరించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో తనకున్న అనుబంధం గురించి కూడా ప్రస్తావించారు.

నవంబర్ 16న జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు.

తొలి వారంలోనే రెండు లక్షల కాపీలు అమ్ముడవడం ఈ పుస్తకంపై పాఠకుల్లో ఉన్న ఆసక్తిని చూపిస్తోంది.

Tags:    
  • soniagandhi 
  • belongingajourneyoflove 
  • harpercollinsindia 
  • soniagandhibook 
  • booksales 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS