• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  దిగ్గజాల వీడ్కోలు.. 2026...

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

| 2026లో పలువురు క్రీడా దిగ్గజాల వీడ్కోలు అభిమానులను కలవరపెడుతోంది. మెస్సీ, రొనాల్డో, నెయ్‌మార్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పినట్లు కథనం పేర్కొంది. మరోవైపు, ఐపీఎల్‌లో 2026 సీజన్‌కు దూరమైన ధోనీ.. 2027 నుంచి సీఎస్‌కే మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఈ పరిణామాలతో అభిమానులు తమ అభిమాన ఆటగాళ్ల ఆటను మిస్ కానున్నారు.

By - A.N.Kumar
Update: 2026-11-18 10:02 GMT

క్రీడా ప్రపంచంలో గెలుపోటములు సహజం. కానీ 2026వ సంవత్సరం మాత్రం అభిమానుల పాలిట ఓ మాస్ రిటైర్మెంట్ మేళాలా మారిపోయింది. ఒకప్పుడు వీళ్ల ఆట చూడటానికి అర్ధరాత్రిళ్లు నిద్రమానుకుని టీవీలకు అతుక్కుపోయిన అభిమానులకు.. ఇప్పుడు కన్నీళ్లు తుడుచుకోవడానికే సమయం సరిపోవడం లేదు. ఒక్కొక్కరుగా వెళ్లిపోతుంటే.. ఇక మేము టీవీలు ఆన్ చేసేదెందుకు స్వామీ అంటూ క్రీడా లోకం గగ్గోలు పెడుతోంది.

ముందుగా ఫుట్‌బాల్ అభిమానుల గుండెలపై బాంబు వేశాడు అర్జెంటీనా మాంత్రికుడు లియోనెల్ మెస్సీ. 2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓడిపోగానే ఇక నా వల్ల కాదు బాబోయ్ అన్నట్లుగా 21 ఏళ్ల అంతర్జాతీయ ప్రయాణానికి శుభం కార్డు వేశాడు. మెస్సీ షాక్ నుంచి తేరుకునేలోపే అతడి చిరకాల ప్రత్యర్థి క్రిస్టియానో రొనాల్డో కూడా నువ్వు తప్పుకుంటే నేనేం తక్కువ తిన్నానా? అన్నట్లుగా పోర్చుగల్ జెర్సీకి గుడ్ బై చెప్పేశాడు. 23 ఏళ్లు.. 234 మ్యాచ్‌లు.. 146 గోల్స్.. అంకెలు బాగానే ఉన్నాయి కానీ ఇకపై ఆ సియూ సెలబ్రేషన్స్ జాతీయ జట్టులో కనిపించవంటే ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. వీరిద్దరి బాటలోనే బ్రెజిల్ స్టార్ నేమార్ కూడా నార్వే చేతిలో ఓటమి తర్వాత నా డ్రిబ్లింగ్ విన్యాసాలు ఇక ఇంటర్నేషనల్ లెవెల్‌లో చాలు అంటూ చేతులెత్తేశాడు. మొత్తానికి వీరంతా క్లబ్ ఫుట్‌బాల్ ఆడుతున్నా దేశం తరఫున ఆడే ఆ కిక్కు ఇక మిస్ అయినట్టే..

ఇక మన దేశంలో క్రికెట్ అభిమానుల పరిస్థితి మరీ దారుణం. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు టాటా చెప్పేసిన మహేంద్ర సింగ్ ధోనీని.. కనీసం ఐపీఎల్‌లోనైనా చూసి మురిసిపోదామనుకున్న ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. 2026 సీజన్‌లో ఫిట్‌నెస్ కారణాలతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే బెంచ్‌కే పరిమితమైన మిస్టర్ కూల్ 2027 సీజన్‌లో ఆటగాడిగా కాకుండా సీఎస్‌కే మెంటార్‌గా అవతారమెత్తనున్నాడు. అంటే ఇకపై ధోనీ హెలికాప్టర్ షాట్లు చూడాలంటే పాత యూట్యూబ్ వీడియోలే దిక్కన్నమాట..

కొత్త హీరోలు వస్తారు.. కొత్త రికార్డులు పుడతాయి.. కానీ ఒక తరాన్ని క్రీడలతో ప్రేమలో పడేసిన ఈ లెజెండ్స్ స్థానాన్ని భర్తీ చేయడం ఎవరి వల్లా కాదు. 2026 క్రీడాభిమానులకు కేవలం క్యాలెండర్ సంవత్సరం మాత్రమే కాదు.. తమ అభిమాన ఆటగాళ్లకు కన్నీటి వీడ్కోలు పలికిన ఒక చేదు జ్ఞాపకం..

Tags:    
  • messi 
  • cristianoronaldo 
  • neymar 
  • msdhoni 
  • football 
  • cricket 

Similar News

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

అండర్-19 ఆసియా కప్ 2026: వారెవ్వా! ఇదిరా కిక్కిచ్చే విక్ట‌రీ అంటే.. గ్రేట్ ఇండియా!

2026-11-14 16:38 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

Copyright @2026

Powered by Blink CMS