ఇప్పుడంతా త్రివర్ణ పతాకాలు, తెల్లకండువాలు...
కేవలం కొన్ని రోజుల వ్యవధిలో పరిస్థి మొత్తం మారిపోయింది. కొన్ని దశాబ్దాల పాటూ కాషాయదళంలో... సర్వసేనాని హోదాల్లో కీలకనాయకుడిగా సేవలందించిన ముప్పవరపు వెంకయ్యనాయుడు తాజా సమావేశాల్లో సభల్లో ఎక్కడా కమలవర్ణం కనిపించడం లేదు. భారతీయ జనతా పార్టీ వాసన కూడా కానరావడం లేదు. అచ్చంగా జాతీయతా వాద సభల్లాగా అవి మారిపోయాయి. ఆయన ప్రస్తుత కార్యక్రమాల్లో ఆద్యంతమూ జాతీయ పతాకాలు - ఆయనను సత్కరించడంలో ధవళవర్ణపు తెల్ల కండువాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేసిన నాటినుంచి.. కొన్ని దశాబ్దాల నాటి ఆయన ఇమేజి పూర్తిగా మారిపోయింది. ఉపరాష్ట్రపతిగా నామినేషన్ వేయడం కోసం.. తన విద్యార్థి దశ నుంచి బలమైన అనుబంధం పెనవేసుకున్న భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడానికి కళ్లమ్మట నీళ్లు పెట్టుకున్న వెంకయ్యనాయుడు ఇమేజి రాత్రికి రాత్రే మారిపోయింది. ఈ రాజ్యాంగ బద్ధమైన పదవికి ఎన్నికలు 5వ తేదీన జరిగి ఫలితాలు వెల్లడయ్యాయి గానీ.. నిజానికి నామినేషన్ వేసిన నాడే వెంకయ్య గెలుపు దాదాపుగా ఖరారైపోయింది. అప్పటినుంచే ఆయన విజయం గురించిన ధీమాతో ఉండిపోయారు. ఎటూ కేంద్రమంత్రి పదవికి, పార్టీకి రాజీనామాలు కూడా చేసేశారు గనుక.. వెంకయ్య పూర్తిగా తన మిత్రులతో భేటీలు - సమావేశాలు - ఆత్మీయ సత్కారాల వరకే పరిమితం అయిపోయారు. ముందే అనుకున్నట్టు నామినేషన్ వేసిన నాటినుంచే ఆయనను అందరూ అభినందించడమూ మొదలైంది.
కాకపోతే ఎక్కడా కమలపరిమళాలు మాత్రం కనిపించడం లేదు. వెంకయ్యనాయుడు విజయం సాధించిన తర్వాత కూడా ఇప్పటికే పలు ఆత్మీయ సత్కార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే.. ప్రతిచోటా ఆయనను ఆహ్వానించడానికి భారత జాతీయ పతాకపు రెపరెపలే కనిపిస్తున్నాయి. ఆయనను సత్కరిస్తున్న వారంతా.. తెల్లటి కండువాలను మాత్రమే కప్పి అభినందిస్తూ.. వెంకయ్యకు తొలగిపోయిన రాజకీయ ఇమేజిని, ఇకపై తటస్థంగా, జాతీయతా వాద రాజ్యంగబద్ధ నాయకుడిగా ఉండవలసిన బాధ్యతను గుర్తుచేసేలా వ్యవహరిస్తున్నారు.
వెంకయ్యనాయుడు ఈనెల 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రస్తుతానికి ఉపరాష్ట్రపతిగా గెలిచిన అభ్యర్థి మాత్రమే. కాకపోతే.. అప్పుడే ఆయనకు ఉపరాష్ట్రపతి ప్రోటోకాల్, భద్రత ఏర్పాట్లు సమస్తం మొదలైపోయాయి. వెంకయ్యనాయుడు బహుశా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో.. ఈ కీలకమలుపును బాగా ఆస్వాదిస్తుంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు.