కియా బాటలో ‘వీర వాహన్’.. అనంతకు జగన్ వరం

Update: 2020-08-05 09:30 GMT
కరువు జిల్లా అనంతపురంపై సీఎం జగన్ మరో వరం కురిపించారు. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ఈ జిల్లాకు పెట్టుబడుల వరద కురిపిస్తున్నారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే ‘కియా’ కార్ల కంపెనీని అనంతపురంలో నెలకొల్పి అభివృద్ధి దిశగా నడిపించిన జగన్ తాజాగా ఎలక్ట్రికల్ బస్ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు‘వీర వాహన’ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

అనంతపురంలోని సోమందేపల్లి సమీపంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ‘వీరవాహన’ కంపెనీకి 124 ఎకరాలు కేటాయించింది. కంపెనీ ప్రతినిధులు పనులు కూడా ప్రారంభించారు.

మొత్తం 1000 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమతో 13వేల ఉద్యోగాలు దక్కుతాయని భావిస్తున్నారు. వచ్చే రెండేళ్లలోపు పూర్తి స్థాయిలో బస్సుల ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఏటా 3వేల బస్సుల తయారీ లక్ష్యంతో యూనిట్ ను వీర వాహన్ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా అనుబంధ కంపెనీలు సైతం ఇక్కడే నెలకొల్పాలని నిర్ణయించారు. దీంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించనుంది.
Tags:    

Similar News