ఇంట్లోకాదు.. కోర్టులోనే భర్తను చితక్కొట్టిన భార్య.. ఎందుకంటే!
కులబురిగి జిల్లాకు చెందిన భార్య, భర్తల కుటుంబం సజావుగా సాగుతోంది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు.;
ఒకప్పుడు భార్యలపై భర్తలు దాడులు చేసేవారు. కొట్టేవారు.. తిట్టేవారు.కానీ, కాలం మారింది. ఇప్పుడు ఆ వంతు భార్యల వం తైంది. భర్తలను ఈసడించడం.. కొట్టడం.. తిట్టడం.. ఆరళ్లు పెట్టడం కామన్‌గా మారిపోయింది. అయితే.. ఎంత అయినా.. నాలు గు గోడల వరకే ఇవి పరిమితం అవుతున్నాయి. బయటపడి కేసుల వరకు వస్తే.. తప్ప భర్తలపై భార్యలు చేస్తున్న ఆగడాలు.. పెద్దగా వెలుగు చూడడం లేదు. దీనిని కోర్టులు తప్పుబడుతున్నాయి. ఇదిలావుంటే.. తాజాగా ఇంట్లోకాదు.. తన భర్తను ఓ భార్య కోర్టులోనే చితక్కొట్టేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
సహజంగా భార్యా భర్తలు.. ఇంట్లో గొడవ పడడం కామనే.కానీ, కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలోని ఓ కుటుంబ న్యాయస్థానంలో భర్తను ఆయన భార్య కోర్టు ఆవరణలో ఎంతో మంది న్యాయవాదులు.. పోలీసులు ఉన్నప్పటికీ.. అవేవీ పట్టించుకోకుండా.. జుట్టు పట్టుకుని లాగి.. డొక్కల్లో తన్నింది. అంతేకాదు.. ఎగిరి కాలితో కూడా కొట్టింది. ఒకదశలో చెప్పు కూడా తీయబోయింది. దీంతో అక్కడ ఉన్నవారు ఆమెను నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ, ఆగలేదు. ఇక, ఇంత జరుగుతున్నా.. భర్త మాత్రం నవ్వుతూ భరించాడు. తిరిగి తాను చేయి చేసుకుంటే..అది మరో కేసు అవుతుందని అనుకున్నాడో ఏమో.. నవ్వుతూనే భార్య చేతిలో దెబ్బలు తిన్నాడు.
ఏం జరిగింది?
కులబురిగి జిల్లాకు చెందిన భార్య, భర్తల కుటుంబం సజావుగా సాగుతోంది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. అయితే.. ఈ ఏడాది మధ్యలో భర్త ఉద్యోగం పోయింది. దీంతో భార్య తెస్తున్న జీతంపైనే కుటుంబం ఆధారపడింది. ఇది.. వివాదాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఎన్నాళ్లు వివాదాలంటూ.. ఇరువురూ.. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక కోర్టు కూడా పరిస్థితిని గమనించి విడాకులు మంజూరు చేసింది. అనంతరం.. భర్త నుంచి భరణం కోరుతూ.. సదరు భార్య కోర్టులో మరో పిటిషన్ వేసింది. దీనిని విచారించిన కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇదే.. కోర్టు ఆవరణలో భర్తను ఈడ్చి ఈడ్చి తన్నడానికి దారి తీసింది.
కోర్టులో భార్య భరణం కోరుతూ.. పిటిషన్ వేస్తుందని తెలిసిన భర్త.. తన పేరుతో ఉన్న ఇల్లు, పొలాలు., వాహనాలను తన తల్లి పేరిట మార్చేశాడు. దీంతో కోర్టులో తనపేరిట రూపాయి కూడా ఆస్తిలేదని చెప్పాడు. రికార్డులను పరిశీలించిన కోర్టు.. అతని వాదనలతో ఏకీభవించింది. భరణం పిటిషన్‌ను రద్దు చేసింది. అంతేకాదు.. భర్త(మాజీ) కు మరో ఉద్యోగం దొరికే వరకు నెలకు రూ. 10000 చొప్పుల భత్యం ఇవ్వాలని భార్యను ఆదేశించింది. ఈ తీర్పుతో మంటెత్తిన భార్య.. కోర్టు నుంచి బయటకు వస్తూనే భర్తపై విరుచుకుపడి.. చిత్తుచిత్తుగా తన్నేసింది. ఇదీ.. సంగతి!.