ఆ పని చేయకుండా 2026 లోకి ఎంట్రీ ఇవ్వొద్దు !
కొత్త ఏడాది మొదలవుతోంది. దాంతో చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. కొత్త ఆశలతో కూడా ఉరకలేస్తున్నారు.;
కొత్త ఏడాది మొదలవుతోంది. దాంతో చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. కొత్త ఆశలతో కూడా ఉరకలేస్తున్నారు. అయితే కొత్త ఏడాదిలో ఎన్నో మార్పులు ఉంటాయి. చేయాల్సిన పనులు ఉంటాయి. వాటిని పూర్తి చేయకుండా హ్యాపీ న్యూ ఇయర్ అనుకుని అడుగు పెడితే మాత్రం సీన్ సితార్ అవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ 2025 వదిలేస్తూ చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు ఏమిటి అన్నది చూస్తే కనుక కీలకమైనవే ఉన్నాయి. ఈ పనులు బ్యాంకింగ్ లావాదేవీలతో ముడిపడి ఉన్నాయి. అలాగే ప్రతీ నిత్యం పెట్టే ఖర్చుకు సంబంధించి డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ముడి పడి ఉన్న అంశాలు కావడంతో అప్రమత్తం కావాలని అంతా సూచిస్తున్నారు.
ఆధార్ తో లింక్ చేశారా :
ఈ రోజున ప్రతీ ఒక్కరికీ పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తప్పనిసరి చేశారు. పాన్ కార్డుని ఆధార్ తో లింక్ చేయమని కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అలా కనుక చేయకపోతే కొత్త ఏడాది తొలి రోజునే భారీ షాక్ తగులుతుందని అంటున్నారు.లింకింగ్ ఆలస్యం చేస్తే పెద్ద సమస్య తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు ఇక గడువు చూస్తే 2025 డిసెంబర్ 31 వరకే ఉంది. అంటే కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంది అన్న మాట. మరి ఈలోగా ఎవరైనా చేయక పోతే వెంటనే చేసేయడం బెటర్ అని అంటున్నారు.
ఆన్ లైన్ ద్వారానే :
ఇక ఆన్ లైన్ ద్వారా కూడా వెంటనే ఎవరికి వారుగా చేసుకోవచ్చు. ఈ ప్రక్రియకు పెద్దగా టైం కూడా తీసుకోదు, కానీ మనకెందుకులే అని బద్ధకిస్తున్నారు. అలా కనుక చేస్తే మాత్రం భారీ రిస్క్ లో పడినట్లే అని అంటున్నారు. పాన్ కార్డు ఆధార్ లింక్ తో లేకపోతే బ్యాంకింగ్ లావాదేవీలు ఏవీ చేయలేరు. అంతే కాటు డిజిటల్ పేమెంట్స్ తో భారీ కొనుగోళ్ళు చేయలేరు, ఇంకం టాక్స్ పన్ను కూడా చెల్లించలేరు. టోటల్ గా బ్యాంకింగ్ లావాదేవీలు మొత్తం స్టాప్ అవుతాయి.
అవి కూడా ఉండవు :
అంతే కాదు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాలైన ప్రభుత్వ పధకాలు కానీ ప్రయోజనాలు పూర్తిగా నష్టపోయే ముప్పు కూడా పొంచి ఉందని ఆర్ధిక వ్యవహారాలు తెలిసిన వారు అంతా హెచ్చరిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఆన్ లైన్ చెల్లింపుల విషయంలో మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతోంది. ఈ నేపధ్యంలో పాన్ తో ఆధార్ కార్డు లింక్ కనుక లేకపోతే ఆర్ధిక నిరక్షరాస్యుడిగా మిగిలిపోవడమే కాదు లావాదేవీలకు దూరంగా ఉండాల్సి వస్తుందని అంటున్నారు మరి ఈ చిన్న విషయం కనుక చేయకుండా కొత్త ఏడాది అని సంబరపడితే మాత్రం 2026 చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు.