మోడీ అమిత్ షా దుర్యోధన దుశ్శాసనులట !
కాశ్మీర్ లోని పహిల్గాంలో జరిగిన దాడి కేంద్రానిదా అని మమత ఒక వింత అయిన వేడెక్కించే ప్రశ్నను సంధించారు.;
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షాలకు దుర్యోధనుడు దుశ్శాసనులు అంటూ కొత్త పేర్లు పెట్టారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ ఇద్దరూ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ప్రత్యక్షం అవుతారు అని నిప్పులు కురిపించారు. శకుని శిష్యుడు దుశ్శాసనుడు అంటూ అమిత్ షా మీద ఒక రేంజిలో మాటలతో చెలరేగిపోయారు దీదీ. బెంగాల్ లోని బంకురా లో బిర్సింగ్ పూర్ లో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ ర్యాలీలో మమత మాట్లాడుతూ మోడీ అమిత్ షాలనే లక్ష్యంగా చేసుకుని విమర్శలతో ఠారెత్తించారు.
పహల్గాం దాడి కేంద్రానిదా :
కాశ్మీర్ లోని పహిల్గాంలో జరిగిన దాడి కేంద్రానిదా అని మమత ఒక వింత అయిన వేడెక్కించే ప్రశ్నను సంధించారు. పశ్చిమ బెంగాల్ ఉగ్రవాదులకు అడ్డా అయిందని చెబుతున్న మోడీ అమిత్ షాలు కేంద్రం ప్రమేయంతోనే ఢిల్లీ ఎర్ర కోట వద్ద దాడులు జరిగాయని చెబుతాయి అని చెబుతారా అని నిలదీశారు. బెంగాల్ లో ఉగ్ర క్యాంపులు ఎందుకు ఉంటాయని ఆమె గద్దించారు. మిగిలిన సమయాల్లో కంటే ఎన్నికలు వస్తే చాలు మోడీ అమిత్ షాలు బెంగాల్ లో ప్రత్యక్షం అవుతారు అని ఆమె నిందించారు.
సర్ తో ఓట్ల గల్లంతు :
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ వల్ల బెంగాల్ లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు చేస్తున్నారు అని మమత ఆరోపించారు. ఇప్పటిదాకా కోటీ యాభై లక్షల ఓట్లను తొలగించారని ఆ ఓట్లు అన్నీ కూడా రాజ్ బన్షీలు, మతువాలు, ఆదివాసీలు వంటి అణగారిన వర్గాల ఓట్లే అని ఆమె ఫైర్ అయ్యారు. మొత్తం బెంగాలీ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికే ఇబ్బందికరమైన పరిస్థితి అని ఆమె అన్నారు.
చొరబాటుదారులకు ఆశ్రయం :
పశ్చిమ బెంగాల్ లో తాజాగా పర్యటించిన అమిత్ షా మమత బెనర్జీ ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సరిహద్దు కంచె కోసం భూమిని కేటాయించడం కంటే చొరబాటుదారులకు బెంగాల్ లో ఆశ్రయం అందించడానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన విమర్శించారు. మతపరమైన సంతృప్తికరణ రాజకీయాల కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని కూడా ఆయన ఆరోపించారు. అవినీతి చొరబాట్లకు రాచబాటగా సాగుతున్న మమత ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఆయన చెప్పారు. మమత మాజీ అవుతారని, బీజేపీ నాయకత్వంలో సుపరిపాలన పేదల సంక్షేమంపై దృష్టి సారించిన ప్రభుత్వం వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ ప్రయోజనాల కోసం చొరబాటును ప్రోత్సహిస్తున్నారని ఉగ్రవాదులకు అడ్డాగా రాష్ట్రం మారిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశిస్తున్న వేళ ఈ విమర్శల జోరు ఇంకా హీటెక్కించేలా సాగుతుందని అంటున్నారు.