అప్పుల కుప్పగా హిమాచల్....దేశానికి గుణపాఠంగా !

ఇదిలా ఉంటే ఎఫ్‌ఆర్‌బీఎం విధించిన పరిధిని సైతం దాటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పులు చేసిందని తాజగా కాగ్‌ తాజా నివేదికలో పేర్కొంది.;

Update: 2025-12-31 03:15 GMT

ఆదాయం కంటే అప్పులు ఉంటే ఏమంటారు. సింపుల్ గా దివాళా తీసింది అని అంటారు. పరిశ్రమలకు పెట్టే పేరు ఖాయిలా పడ్డాయని. అలాగే భారీ కర్మాగారాల విషయం అయితే బలి పీఠం మీద ఉన్నాయని చెబుతారు. మరి రాష్ట్రం అప్పులతో అన్ని రకాలుగా దిగజారిపోతే ఏమంటారు, దివాళా దీసింది అనే అంటారు, ఇది ఆర్ధిక నిపుణులు చెప్పే మాట. ఈ రోజున చూస్తే కేంద్రం తో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పుల విషయంలో పోటీ పడుతున్నాయి. ప్రతీ మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర చూస్తే ఎవరి అప్పు ఎంతో తెలుస్తుంది. ఇదిలా ఉంటే దేశంలో కాంగ్రెస్ చేతిలో మూడు రాష్ట్రాలు ఉంటే అందులో కర్ణాటక తెలంగాణాతో పాటుగా హిమాచల్ ప్రదేశ్ ఉంది.

భారీ హామీలతో :

దేశంలో ఎక్కడ లేని హామీలను హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చింది. 2022 లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో, కాంగ్రెస్ ఒక లక్ష కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది అంతే కాదు పాత పెన్షన్ పథకం ఓపీఎస్ ని పునరుద్ధరిస్తామని కూడా ఎక్కడా అమలు చేయలేని భారీ హామీ ఇచ్చింది. మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు అందించడం వంటి ముఖ్యమైన సామాజిక సంక్షేమ హామీలను కూడా ఇచ్చింది. అయితే అదే సమయంలో రాష్ట్ర రుణం సంగతిని కాంగ్రెస్ ఎన్నికలలో విజయం కోసం విమర్శించింది అని ప్రత్యర్ధులు విమర్శించారు.

అతి పెద్ద సవాళ్ళు :

ఇక ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం పునరుద్ధరించింది. అలాగే, ముఖ్యమంత్రి నారీ సమ్మాన్ నిధి కింద మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు. అయితే లక్ష ఉద్యోగాల వాగ్దానాన్ని పూర్తిగా అమలు చేయడంలో విమర్శల పాలు అయింది. హిమాచల్ తన ఉద్యోగులకు ఓపీఎస్ ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. కానీ ఇపుడు ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేక ఇబ్బంది పడుతోంది.

అనేక ఇబ్బందులతో :

ఇక మహిళలకు నెలకు 1500 రూపాయల హామీని కూడా నెరవేర్చింది. లక్ష ఉద్యోగాలను వాగ్దానం చేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయడం ద్వారా గణనీయమైన సంఖ్యలో ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేశారు అయితే ఓపీఎస్ నారీ సమ్మాన్ నిధిని అమలు చేయడం వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఇతర అభివృద్ధి రంగాలపై ప్రభావం చూపుతోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఆచరణ సాధ్యం కాని 10 గ్యారెంటీలను ఇచ్చి హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఇపుడు అప్పులతో పీకల్లోతు ఇబ్బందులలో కూరుకుని పోయింది అని అంటున్నారు.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి :

ఇదిలా ఉంటే ఎఫ్‌ఆర్‌బీఎం విధించిన పరిధిని సైతం దాటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పులు చేసిందని తాజగా కాగ్‌ తాజా నివేదికలో పేర్కొంది. ఇప్పటికి మూడేళ్ళకు పైగా పాలన సాగింది. ఇంతలోనే ఆర్ధికంగా సరైన క్రమశిక్షణ లేకపోవడంతో అప్పుల కుప్పగా రాష్ట్రం మారింది అని అంటున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం విధించిన పరిధి 90,000 కోట్ల రూపాయలను అధిగమించి మొత్తం అప్పు 95,633 కోట్ల రూపాయల దాకా చేసిందని అంటున్నారు. ఈ పరిణామాలతో హిమాచల్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

వేతన జీవుల పాట్లు :

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితికి ప్రభుత్వం చేరుకుందని అంటున్నారు. దాంతో ఉద్యోగుల జీతాలలో వీలైనంత మేరకు కోత విధించాలని ఎక్కడా ఎవరూ తీసుకోని కొత్త నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు అంతా మండిపోతున్నాయి. ఇదే తీరున కొనసాగితే తాము సహించేది లేదని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద గంజాయి సాగుకు కూడా అనుమతించి ఎంతో కొంత ఆదాయం అందుకోవాలని ఈ రాష్ట్రం చూస్తోంది అంటే దివాళా అంచుల్లో ఉన్నట్లే అని అంటున్నారు.

Tags:    

Similar News