ఉత్తరాంధ్రకు కేంద్రం న్యూ ఇయర్ గిఫ్ట్
కేంద్ర ప్రభుత్వం ఏపీ మీద చూపించే ప్రత్యేక శ్రద్ధకు ఇది ఒక ఉదాహరణగా భావించాలి. కొత్త ఏడాది 2026 వస్తూనే కేంద్రం ఏపీకి ఒక బ్రహ్మాండమైన బహుమానాన్ని సిద్ధం చేసింది.;
కేంద్ర ప్రభుత్వం ఏపీ మీద చూపించే ప్రత్యేక శ్రద్ధకు ఇది ఒక ఉదాహరణగా భావించాలి. కొత్త ఏడాది 2026 వస్తూనే కేంద్రం ఏపీకి ఒక బ్రహ్మాండమైన బహుమానాన్ని సిద్ధం చేసింది. అంతే కాదు కొత్త ఏడాదిలో అడుగు పెడుతూనే ఆ గిఫ్ట్ ని తీసుకోమంటోంది. ఉత్తరాంధ్ర కు ప్రత్యేకంగా కేంద్రం ఇస్తున్న ఆ గిఫ్ట్ చూస్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అవాల్సిందే.
ముందే వచ్చిన సంబరం :
ఉత్తరాంధ్రా ఉమ్మడి మూడు జిల్లాల ఆర్ధిక పరిస్థితులను ఒక్కసారిగా పెంచబోతున్న భోగాపురం ఎయిర్ పోర్టు 2026 జూన్ నాటికి పూర్తి అవుతోంది దానిని సంబంధించిన పనులు ఒక వైపు శరవేగంగా పూర్తి అవుతున్నాయి. మరో వైపు చూసే ఆరు నెలలకు ముందే ఒక విమానం భోగాపురం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవడం. ఇది నిజంగా హ్యాపీ న్యూస్ గానే అంతా చూస్తున్నారు. రెడీ కాబోతున్న విమానాశ్రయానికి అపుడే ఒక విమానం వచ్చి ల్యాండ్ కావడం అంటే నిజంగా గ్రేట్ అని అంటున్నారు.
కమర్షియల్ ఫ్లైట్ :
ఇక ఢిల్లీ నుంచి నేరుగా భోగాపురానికి తొలి కమర్షియల్ ఫ్లైట్ జనవరి 4వ తేదీన రానుంది. ఎయిర్ ఇండియా వారి వ్యాలీడేషన్ విమానం ఢిల్లీ నుంచి ఆ రోజున బయలుదేరి భోగాపురంలో ల్యాండ్ అవుతుంది. ఇక ఇదే విమానంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఇప్పటిదాకా విశాఖ విమానాశ్రయంలో దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయనగరం జిల్లా భోగాపురం వెళ్ళే కేంద్ర మంత్రి ఇపుడు కాలు కింద పెట్టకుండా ఎలాంటి హాల్టులు లేకుండా అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకే వస్తున్నారు అంటే ఇక ఉత్తరాంధ్రా దశ తిరిగినట్లే అని అంతా అంటున్నారు.
భారీ వేడుకగా :
తొలి విమానం ఢిల్లీ నుంచి భోగాపురానికి రావడం అన్నది భారీ వేడుకగా నిర్వహించేందుకు కూటమి మంత్రులు సిద్ధపడుతున్నారు. ఆ రోజున భోగాపురం విమానాశ్రయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి కొత్త ఏడాది వస్తూనే తొలి శుభవార్త ఉత్తరాంధ్రకే విమానం రూపంలో మోసుకొచ్చింది అని అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు జూన్ నాటికి పూర్తి అయి తొలి విమానం అక్కడ నుంచి ఎగిరితే రానున్న రోజులలో ప్రపంచంతో ఉత్తరాంధ్రా నేరుగా కనెక్ట్ అవుతుంది అని అంటున్నారు. అది ఊహించని అభివృద్ధికి దారి తీస్తుందని నమ్మకంగా చెబుతున్నారు.