• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏంది కేసీఆర్.. ఈ...

ఏంది కేసీఆర్.. ఈ లెక్కలన్ని నిజమేనా?

By - Tupaki Desk
Update: 2020-04-16 05:00 GMT
కరోనా వేళ విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ సర్కారు చేస్తున్న సాయానికి సంబంధించి కొత్త తరహాలో ‘లెక్క’ చెప్పారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పేద ప్రజలకు రెండు నెలలకు పన్నెండు కేజీల చొప్పున బియ్యాన్ని అందించటంపై ఆయన విరుచుకు పడుతున్నారు. తెల్లరేషన్ కార్డుల వారికి ప్రభుత్వం పన్నెండు కేజీల బియ్యం ఇస్తామని ప్రకటించిందని.. రేషన్ షాపుల్లో కేజీ బియ్యం రూపాయి మాత్రమేనని.. అంటే.. పన్నెండు కేజీలు ఇస్తున్నందున ప్రభుత్వం చేస్తున్న సాయం పన్నెండు రూపాయిలేనని.. నెలకు చూస్తే ఆరు రూపాయిలేనని చెప్పారు.

అంతేకాదు.. నెలకు ఐదు కేజీల చొప్పున బియ్యాన్ని కేంద్రం ఇస్తుందని.. ఈ లెక్కన చూస్తే కేసీఆర్ సర్కారు చేస్తున్న సాయం రూపాయి మాత్రమేనంటూ షాకింగ్ లెక్క చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ ప్రకటించిన 23 రోజులైనా తెల్లరేషన్ కార్డు దారులకు కేసీఆర్ ప్రకటించిన పన్నెండు కేజీల బియ్యం.. రూ.1500 సాయం ఇప్పటికి అందరికి అందలేదన్నారు. తెల్లరేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పది లక్షల మంది పేదలకూ ఈ సాయం అందించాలని చెప్పారు.

గతంలో మాదిరి బియ్యంతో పాటు తొమ్మిది రకాల  నిత్యవసర వస్తువులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. బియ్యంతో పాటు మూడు కేజీల పప్పు.. కిలో నూనె.. పంచదార సరఫరా చేయాలన్నారు. కేసీఆర్ పాలనలోని నిర్వహణ లోపాల కారణంగా పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లుగా ఆరోపించారు. గతంలో నెలకు రూ.8 నుంచి రూ.10వేల కోట్ల వరకూ తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఉంటుందని చెప్పారని.. అదే నిజమనుకుంటే ఉద్యోగుల వేతనాలు.. పింఛన్లకు నెలకురూ.3400 కోట్లు మించదన్నారు. అలాంటప్పుడు లాక్ డౌన్ ఒక్క వారమే జరిగినప్పుడు పూర్తి స్థాయిలో వేతనాలు.. పింఛన్లు ఎందుకు ఇవ్వనట్లు? అని ప్రశ్నించారు. మరీ.. లెక్కలకు కేసీఆర్ ఏమని బదులిస్తారో చూడాలి.
Tags:    
  • Uttam Kumar Reddy Comments On CM KCR 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS