• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమెరికా దెబ్బ‌కు మ‌న ఐటీ...

అమెరికా దెబ్బ‌కు మ‌న ఐటీ కంపెనీలు కుదేల్‌

By - Tupaki Desk
Update: 2016-05-27 09:40 GMT
ల్యాండ్ ఆఫ్ ఇమ్మిగ్రేంట్స్ గా పేరుపొందిన అగ్ర‌రాజ్యం అమెరికా ఇపుడు ఆ వ‌ల‌స‌దారులకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే దిశ‌గా అడుగులు వేసింది. కొద్దికాలం క్రితం చ‌దువుకునేందుకు వ‌స్తున్న విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన అమెరికా ఆ త‌ర్వాత ఇప్ప‌టికే ఆ దేశంలో ఉద్యోగం చేస్తున్న వారిపై త‌న ప్ర‌తాపం చూపింది. ఇపుడు ఆ దేశం చూపు హెచ్ 1బీ - ఎల్1 వీసాల‌పై ప‌డింది.

హెచ్ 1బీ - ఎల్1 వీసాల్లోని కొన్ని కేటగిరీల వీసాల ఫీజులను అమెరికా భారీగా పెంచింది. డిసెంబర్ 18 - 2015 తర్వా హెచ్1బీలోని కొన్ని కేటగిరీల వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లు  అదనంగా ఒక్కో వీసాకు $4000 డాల‌ర్లు చెల్లించాలని యూఎస్ సిటిజన్‌ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్(యూఎస్‌ సీఐఎస్) స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు త‌న వెబ్‌ సైట్‌ లో ప్రకటించింది. అలాగే..ఎల్1ఏ - ఎల్2బీ దరఖాస్తుదారులు $4500 డాల‌ర్లు అదనంగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ పెంపు సెప్టెంబర్ 30 - 2025 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. అమెరికాలో పూర్తిస్థాయి ఉద్యోగస్తులున్న వారి విష‌యంలోనూ, పార్ట్‌ టైమ్ ఉద్యోగుస్తులుగా ఉన్న వారికి సైతం ఈ నిబంధ‌న వ‌ర్తిస్తుంద‌ని తేల్చిచెప్పింది. హెచ్1బీ - లేదా ఎల్1ఏ - ఎల్1బీ నాన్ ఇమిగ్రంట్ స్టేటస్  వీసాదారులై ఉన్న కంపెనీలకు ఈ పెంపు వర్తిస్తుందని యూఎస్‌ సీఐఎస్ తెలిపింది. ఈ ఫీజు సాధారణ - ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు - ఫ్రాడ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఫీజు - అమెరికన్ కాంపిటీటివ్‌ నెస్ అండ్ వర్క్‌ఫోర్స్ ఇంప్రూవ్‌ మెంట్ యాక్ట్ ఫీజులకు అద‌నమని స్పష్టం చేసింది.

అమెరికాలో ఉన్న హెచ్1బీ  వీసాల్లో మ‌న‌దేశానికి చెంద‌న వారివే ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో భార‌తీయ ఐటీ కంపెనీ తీవ్ర ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. త్వ‌ర‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఈ ఫీజు వ‌డ్డ‌న‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా... ఒబామా  గ‌త ఏడాది డిసెంబర్ 18న సంతకం చేయడంతో సంబంధిత చట్టం అమల్లోకి  రావ‌డం గ‌మ‌నార్హం.
Tags:    
  • US 
  • H1B and L1 visa fee 
  • Telugu NEWs 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS