బ్రేకింగ్: కరోనాతో కేంద్రమంత్రి కన్నుమూత

Update: 2020-09-23 17:33 GMT
కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ అంగడీ కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఇటీవలే ఆయన చేరారు. ఈరోజు పరిస్థితి విషమించి చనిపోయారు.

కర్ణాటకలోని బెళగావికి చెందిన సురేష్ అంగడీ 2004,2009,2014,2019  ఎన్నికల్లో వరుసగా బీజేపీ తరుఫున ఎంపీగా గెలిచారు. ఈ క్రమంలోనే ఈసారి కేంద్రమంత్రి అయ్యారు.

ఈనెల 11న సురేష్ అంగడికి కరోనా సోకగా.. కోలుకుంటున్నారని అంతా అనుకుంటున్న సమయంలో ఆయన మరణించడం విషాదం నింపింది. అయితే అయిన కరోనా కారణంగా చనిపోయారా? లేక ఇతర కారణమా అన్నది తెలియాల్సి ఉంది.

కాగా ఇప్పటివరకు కేంద్ర హోంమంత్రి నుంచి చాలా మందికి కరోనా సోకినా పెద్దగా ప్రమాదం వాటిల్లలేదు. కానీ తొలిసారి ఓ కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి కరోనాతో చనిపోవడం విషాదం నింపింది.
Tags:    

Similar News