నెంబర్ 1 వర్సెస్ 45... ఈ యుద్ధం జరిగేపనేనా..!
గ్రీన్ లాండ్ పై కన్నేసిన అమెరికాతో దానిపై పాక్షిక ఆధిపత్యమున్న డెన్మార్క్ యుద్ధానికి దిగితే జరిగే పరిణామాలేమిటి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.;
గ్రీన్ లాండ్ పై కన్నేసిన అమెరికాతో దానిపై పాక్షిక ఆధిపత్యమున్న డెన్మార్క్ యుద్ధానికి దిగితే జరిగే పరిణామాలేమిటి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే సైనిక శక్తి పరంగా చూస్తే అమెరికా టాప్ ప్లేస్ లో ఉంటే.. డెన్మార్క్ స్థానం 45 గా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య యుద్ధంలో.. అగ్రరాజ్యాన్ని డెన్మార్క్ ఒంటరిగా అడ్డుకోలేదు కానీ.. ఆ దేశానికి ఐరోపా కూటమి మద్దతుగా నిలుస్తుందా అనేది మరో కీలక చర్చగా మారింది.
అవును... గ్రీన్ లాండ్ పై అమెరికా కన్నేసిన సంగతి తెలిసిందే. ఆరు నూరైనా నూరు ఆరైనా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మరో రాష్ట్రంగా గ్రీన్ ల్యాండ్ అవతరించబోతుందన్నట్లుగా ట్రంప్ చెబుతున్నారు.. ఈ మేరకు ఓ బిల్లు కూడా తెరపైకి తెచ్చారు. ఈ సందర్భంగా స్పందిస్తూ.. ఈ విషయంలో చెప్పిన మాట వినకపోతే సైనిక చర్యకూ వెనుకాడబోమని హెచ్చరిస్తోన్నారు. అయితే.. ఈ బెదిరింపులపై గ్రీన్ లాండ్ తోపాటు దానిపై పాక్షిక ఆధిపత్యమున్న డెన్మార్క్ మండిపడుతున్నాయి.
పైగా అమెరికా సై అంటే తామూ సై సై అంటోంది. ఈ నేపథ్యంలో అంత పెద్ద అగ్ర రాజ్యాన్ని డెన్మార్క్ అడ్డుకోగలదా.. అసలు ఆ దేశానికి ఉన్న సైనిక బలమెంత.. అనే అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరోవైపు అసలు గ్రీన్ లాండ్ ను ప్రత్యేకంగా ఆక్రమించుకోవాల్సిన అవసరమే అమెరికాకు లేదని.. గ్రీన్ లాండ్ లో ఇప్పటికే అమెరికా ఉనికి భారీగా ఉందని.. దానిని విస్తరించుకునే ఒప్పందమూ ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఈ సమయంలో ఆర్టికల్ 51ని తెరపైకి తెస్తోంది డెన్మార్. దీని ప్రకారం... ఒక నాటో సభ్య దేశం దాని భూభాగంపై సాయుధ దురాక్రమణకు గురైతే, ఇతర సభ్య దేశాలు ఐక్యరాజ్యసమితి చార్టర్ లోని ఆర్టికల్ 51 ప్రకారం.. తమ శక్తి మేరకు అన్ని విధాలుగా సహాయం చేయవలసిన బాధ్యతను కలిగి ఉంటాయి. ఇది కొన్ని సభ్య దేశాల భద్రత, రక్షణ విధానం యొక్క నిర్దిష్ట లక్షణాన్ని పక్షపాతం చేయకూడదు! డెన్మార్క్ తాజాగా ఈ విషయాన్ని ప్రస్థావిస్తోంది.
ఈ సందర్భంగా అమెరికా, డెన్మార్క్ ల సైనిక బలబలాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దామ్...!
అమెరికా క్రియాశీల సైన్యం 13 లక్షలుగా ఉంటే.. డెన్మార్క్ సైన్యం 20,000గా ఉంది. రిజర్వ్ దళం అమెరికాకు 8 లక్షలుగా ఉంటే.. డెన్మార్క్ రిజర్వ్ దళం 12వేలుగా ఉంది. పారా మిలటరీ అమెరికాకు 4.64 లక్షలుగా ఉంటే.. డెన్మార్క్ పారా మిలటరీ దళం 51వేలు. ఇక.. అమెరికా యుద్ధ ట్యాంకులు అమెరికాకు 3.91 లక్షలుగా ఉంటే.. డెన్మార్క్ వద్ద 44 మాత్రమే ఉన్నాయి. యుద్ధనౌకలు అమెరికా వద్ద 440 ఉంటే.. డెన్మార్క్ వద్ద 50 ఉన్నాయి.
కాగా... గ్రీన్ లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. ఈ ద్వీపం చాలా తక్కువ జనాభా కలిగి ఉన్నప్పటికీ యునైటెడ్ స్టేట్స్ కు వ్యూహాత్మకంగా అమూల్యమైనది. గ్రీన్ లాండ్ జీ.ఐ.యూకే అంతరం (గ్రీన్ లాండ్ - ఐస్లాండ్ - యూకే) పక్కన ఉంది. ఇది ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ రవాణా మార్గాలకు ముఖ్యమైన మార్గంమే కాకుండా.. క్షిపణి రక్షణ కార్యకలాపాలకు కీలకం. ఈ నేపథ్యంలోనే గ్రీన్ లాండ్ పై ట్రంప్ భారీగా మనసుపారేసుకున్నారని అంటున్నారు.