ఎక్కడికక్కడ శవాల గుట్టలు.. 12,000 దాటిన మృతులు!

ఇరాన్ లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.;

Update: 2026-01-16 07:35 GMT

ఇరాన్ లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిరసనకారులపై భద్రాతాదళాలు జరిపిన కాల్పుల్లో వేల మంది మృతిచెందారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ప్రధానంగా ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 2,000 - 3,000 మధ్య అనే ప్రచారం జరిగింది కానీ... వాస్తవానికి ఈ హింసాత్మక నిరసనల్లో మృతి చెందినవారి సంఖ్య 12,000కు పైగానే ఉంటుందని అంటున్నారు. దీంతో.. ఈ విషయం తెలిసిన ప్రపంచం ఉలిక్కిపడుతోంది!

అవును... రెండు వారాలకు పైగా విస్తృతంగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అడ్డుకోవడానికి అధికారులు చేపట్టిన అణిచివేత చర్యలో వేల మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ లోపల నుండి వచ్చే కాల్స్ కోసం ఫోన్ లైన్లు తెరవడంతో.. ఇరాన్ లోపల ఉన్న ఒక వ్యక్తితో సహా రెండు వర్గాలు తమతో మాట్లాడుతూ.. కనీసం 12,000 మందికి పైగా మరణించి ఉంటారని చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది! ఈ సంఖ్య 20,000 పెరిగినా ఆశ్చర్యం లేదని చెప్పినట్లు వెల్లడించింది.

ప్రధానంగా సుమారు వారం రోజులకు పైగా దేశంలో ఇంటర్నెట్ నిలిపివేయడంతో.. లోపల ఏమి జరుగుతుందనే విషయం బయట ప్రపంచానికి స్పష్టంగా తెలియలేదని.. అయితే తాజాగా పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా వైద్య అధికారుల నివేదికల ఆధారంగా.. కనీసం 12,000 మంది మరణించారని.. బహుశా ఆ సంఖ్య 20,000 వరకు ఉండవచ్చని అంటున్నారు.

అశాంతి కారణంగా జరిగిన మొత్తం మరణాల గురించి ఇరాన్ అధికారులు ఇప్పటివరకూ సాధారణ అధికారిక అంచనాలను అందించలేదు. డిసెంబర్ 28న నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి సుమారు 2,000 మంది వరకూ మరణించారని మాత్రం ఆ దేశ ప్రభుత్వ మీడియా చెప్పుకొస్తుంది. అయితే ఈ మరణాలు కూడా తమ వల్ల సంభవించలేదని.. నిరసనల్లో ఉగ్రవాదులు చొరబడి సృష్టించిన మారణహోమం అన్నట్లుగా భద్రతా దళాలు చెబుతున్నాయి!

ఈ ఘటనపై స్పందించిన నార్వేకు చెందిన కార్యకర్త సంస్థ ఇరాన్ హ్యూమన్ రైట్స్ కు నాయకత్వం వహిస్తున్న మహమూద్ అమిరీ-మొగద్దమ్... నిరసనలపై హింసాత్మక అణిచివేత మనం ఊహించలేని దానికంటే చాలా దారుణంగా ఉందని తమకు అందుతున్న సమాచారం చూపిస్తుందని.. ఈ తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనల నుండి, సామూహిక హత్యల నుండి పౌరులను రక్షించడానికి బాధ్యత అనే యంత్రాంగం మన వద్ద ఉందని తెలిపారు.

యునైటెడ్ స్టేట్స్ మాత్రమే కాదు, అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే కాదు, యూరోపియన్ యూనియన్, ప్రాథమికంగా అన్ని దేశాలు ఈ దురాగతాలను ఆపడానికి బాధ్యత వహించాలని కోరారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఇంటర్నెట్ ను ఆపేయడం అనేది ఏకాంత నిర్భందం లాంటిదని.. వారు ఇరానియన్ ప్రజలను ఏకాంత నిర్భందంలో ఉంచి, వారిని హింసించడం, చంపడం చేశారని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News