వైసీపీ టాక్: ముందుకు రావట్లేదా.. రానివ్వట్లేదా.. ?
వైసీపీలో ఇప్పటికీ.. కొందరు నాయకులు బయటకు రావడం లేదు. ఒకరిద్దరు మాత్రమే.. పార్టీ పరంగా వాయిస్ వినిపిస్తున్నారు.;
వైసీపీలో ఇప్పటికీ.. కొందరు నాయకులు బయటకు రావడం లేదు. ఒకరిద్దరు మాత్రమే.. పార్టీ పరంగా వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో నిజంగానే ఇష్టం లేక కొందరు బయటకు రావడం లేదా? లేక పార్టీనే ఇంకా లక్ష్మణ రేఖలు కొనసాగిస్తోందా? అనేది చర్చకు దారితీస్తోంది. వాస్తవానికి పార్టీ పరంగా ఎవరైనా బలమైన గళం వినిపిస్తే వారిని ప్రోత్సహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పార్టీ ఓడిపోయిన దరిమిలా.. ఇప్పుడు మరింత శక్తిని పుంజుకునేందుకు బలమైన నాయకుల అవసరం కూడా ఉంది.
ఈ రకంగా చూసుకుంటే.. నాయకులు పెద్దగా స్పందిస్తున్న దాఖలా కనిపించడం లేదు. అవకాశం లేకపో తే.. ఓకే అని సరిపుచ్చుకోవచ్చు. కానీ, అవకాశం ఉండి కూడా.. మీడియా ముందుకు కూడా రాని నాయకు లు చాలా మంది ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? అనేది ముఖ్యమైన ప్రశ్నగా మారింది. ఒకప్పుడు రాయలసీమలో బలమైన నాయకత్వం వైసీపీకి అండగా ఉంది. కానీ.. ఇప్పుడు సీమలో ఒకరిద్దరు తప్ప.. ఎవరూ పార్టీ తరఫున గళం వినిపించడం లేదు.
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒక్కరే తరచుగా మీడియా ముందుకు వస్తున్నారు. లేదా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇక, నెల్లూరులో ఎవరూ వాయిస్ వినిపించడం లేదు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తన నియోజకవర్గాన్ని కాపాడుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారన్న ప్రచారం తప్ప.. ఇతర నియోజక వర్గాల్లో నాయకులు ఎవరూ ముందుకు వచ్చిన దాఖలా కనిపించడం లేదు. ఇక, ఉమ్మడి ప్రకాశంలో అయితే.. వైసీపీ పరిస్థితి సైలెంట్‌గా ఉంది.
ఇక, విజయవాడ, ఉమ్మడి కృష్ణాజిల్లాల్లో పేర్ని నాని.. దేవినేని అవినాష్ ఇద్దరే తరచుగా మీడియా ముందు కు వస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి మాట్లాడే వారు లేకుండా పోయారు. మాజీ మంత్రి కుర సాల కన్నబాబు పార్టీ వ్యవహారాలు గుర్తుకు వచ్చినప్పుడు స్పందిస్తున్నారు.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నా రు. ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ధర్మాన సోదరులు మాత్రమే అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు. దీంతో అసలు పార్టీలో నాయకులు ముందుకు రావడం లేదా? లేక.. పార్టీనే ఇంకా లక్ష్మణ రేఖలు గీస్తోందా? అనేది వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.