బీజేపీ కీల‌క నిర్ణ‌యం: మ‌మ‌త బ్యాచ్‌కు టికెట్లు

రాజ‌కీయాల్లో ఎవ‌రి ప్లాన్ వారిది!. ఎవ‌రి వ్యూహాలు వారివి!. ఇప్పుడు ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఇదే త‌ర‌హా వ్యూహాన్ని బీజేపీ నాయకులు అనుస‌రిస్తున్నారు.;

Update: 2026-03-19 01:30 GMT

రాజ‌కీయాల్లో ఎవ‌రి ప్లాన్ వారిది!. ఎవ‌రి వ్యూహాలు వారివి!. ఇప్పుడు ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఇదే త‌ర‌హా వ్యూహాన్ని బీజేపీ నాయకులు అనుస‌రిస్తున్నారు. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో రెండు ద‌శ‌ల్లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. త‌ద్వారా.. మ‌మత స‌ర్కారు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకునేం దుకు అవ‌కాశం చాలా వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంది. ఇది బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారుతోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరే కత‌ను పెంచేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

వీటికి అడ్డుక‌ట్ట వేసేందుకు మ‌మ‌త‌కు స‌మ‌యం చిక్క‌డం లేదు. ఇక‌, ఇప్పుడు మ‌రో తాజా ప‌రిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఎన్నిక‌ల‌షెడ్యూల్ ప్ర‌క‌టించ‌గానే.. బీజేపీ వ్యూహాత్మ‌కంగా.. 140 సీట్ల‌కు త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. త‌ద్వారా అధికార ప‌క్షం మ‌మ‌త‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింది. అయితే.. ఆమె కూడా.. 140 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ఉంటే స‌రిపోయేది. కానీ, ఇక్క‌డే బుట్ట‌లో ప‌డ్డారు. ఏకంగా 294 స్థానాలకు కూడా ఆమె అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు.

ఇది బీజేపీకి వ‌రంగా మారింది. ఎలాగంటే.. మ‌మ‌త ప్ర‌స్తుతం ఉన్న త‌న ఎమ్మెల్యేల్లో 74 మందికి టికెట్లు ఇవ్వ‌లేదు. వీరికి వివిధ కార‌ణాలు ఉన్నాయ‌ని ఆమె స్వ‌యంగా ప్ర‌క‌టించారు. కానీ.. వీరు తీవ్ర అసంతృ ప్తిలో మునిగిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టికెట్లు రాలేదంటే.. అది పార్టీపై ప్ర‌భావం చూపుతుంద‌న్న ఆలోచ‌న మ‌మ‌త చేసిన‌ట్టుగా లేరు. దీంతో బీజేపీ వీరిలో స‌గం మందికిపైగా అంటే.. 40 మందికిపైగానే త‌మ‌వైపు తిప్పుకొనేందుకు రాత్రి కి రాత్రే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

త‌ద్వారా.. టికెట్ ఇవ్వ‌ని మ‌మ‌త‌ను ఓడించేందుకు వీరంతా మ‌రింత క‌సితో ప‌నిచేస్తార‌న్న‌ది బీజేపీ వ్యూహం. గ‌త తెలంగాణ ఎన్నిక‌ల్లోనూ ఇదే జ‌రిగింది బీఆర్ ఎస్ నుంచి టికెట్ రాని కొంద‌రు నేత‌లు.. కాంగ్రెస్ లో టికెట్ తెచ్చుకున్నారు. వైసీపీలో టికెట్ రాని కొంద‌రు నాయ‌కులు టీడీపీలో చేరి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇదే వ్యూహాన్ని బీజేపీ ఇప్పుడు బెంగాల్‌లో అనుస‌రిస్తోంది. మ‌మ‌త‌కు నిన్న మొన్న‌టి వ‌ర‌కు జైకొట్టిన వారికి టికెట్లు రాక‌పోవ‌డంతో వారి ఆగ్ర‌హాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకునే రాజ‌కీయ వ్యూహానికి క‌మ‌ల‌నాథులు తెర‌దీశారు. మ‌రి ఇది స‌క్సెస్ అవుతుందా? లేదా? అనేది చూడాలి. ప్ర‌స్తుతం అయితే.. మ‌మ‌త‌కు సెగ పెంచుతున్నార‌న్న‌ది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News