• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విధుల్లో చేరుతున్న...

విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు..డిపోల దగ్గర పండగ వాతావరణం!

By - Tupaki Desk
Update: 2019-11-29 05:18 GMT
తెలంగాణ ఆర్టీసీ సమ్మె కి సీఎం కేసీఆర్ ముగింపు పలికాడు. తమ  డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు 55 రోజుల తర్వాత శుక్రవారం విధుల్లో చేరుతున్నారు. కార్మికులని బేషరతుగా  విధుల్లో చేర్చుకునేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనితో శుక్రవారం తెల్లవారుజాము నుండే ఆర్టీసీ కార్మికులు డిపోల వద్దకు చేరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల పరిధిలో కార్మికులంతా విధులకు తరలివస్తున్నారు. అలాగే  తమకు ఎలాంటి షరతులు విధించకుండా తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో కార్మికులు ఆనందంగా ఉన్నారు.

ఇన్నాళ్లు బస్సులు సమయానికి రాక ఇబ్బందులు పడ్డ జనం కూడా.. ఆర్టీసీ కార్మికుల చేరికతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని డిపోల్లో కార్మికుల సమ్మె సమయంలో బలిదానం చేసిన కార్మికులకు నివాళులు అర్పించి విధుల్లో చేరుతున్నారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కార్మికులు సమ్మె బాట పట్టిన తరువాత   50 రోజులకు పైగా సేవలందించిన తాత్కాలిక డ్రైవర్లు - కండక్టర్లు నేటి నుండి  ఆర్టీసీ నుంచి తప్పుకుంటున్నారు. సమ్మె రోజుల్లో వీళ్లంతా చక్కగా పనిచేశారని - తాత్కాలిక ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది అని సీఎం కేసీఆర్ వారికి కూడా భరోసా ఇచ్చారు. 

అలాగే ఆర్టీసీ సంక్షేమం కోసం కిలోమీటర్ కు 20 పైసలు చొప్పున టిక్కెట్ రేటు పెంచబోతున్నట్టు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. తద్వారా 760 కోట్ల అదనపు ఆదాయాన్ని అంచనా వేస్తోంది ప్రభుత్వం. పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి.  దీనితో పాటుగా ఆర్టీసీకి తక్షణ సహాయం కింద రూ.100కోట్లు కూడా మంజూరు చేశారు. మొత్తంగా సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మె కి ముగింపు పలికి కార్మికులని విధుల్లోకి చేరండి అని చెప్పడంతో రాష్ట్రంలో అన్ని డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులతో పండుగ వాతావరణం కనిపిస్తోంది.
Tags:    
  • TSRTC Employees 
  • TElugu News 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS