• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తిరుపతి రైతుల సభకు... ...

తిరుపతి రైతుల సభకు... తెలుగుదేశం పిలుపు

By - Tupaki Desk
Update: 2021-12-16 09:09 GMT
తిరుప‌తి వేదిక‌గా శుక్ర‌వారం నిర్వ‌హించ‌నున్న అమ‌రాతి రైతుల మ‌హాస‌భ‌కు ప్ర‌జానీకం త‌ర‌లి రావాల‌ని.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చింది. అమ‌రావ‌తి అంద‌రిదీ అని.. కేవ‌లం రైతుల‌కు మాత్ర‌మే చెందిన న‌గ‌రం కాద‌ని.. పార్టీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ప్ర‌తి ఒక్క‌రూ ఈ స‌భ‌కు హాజ‌రు కావాల‌ని కోరింది. తిరుపతిలో తలపెట్టిన రాజధాని అమరావతి పరిరక్షణ మహోధ్యమ సభకు రాష్ట్ర ప్రజానీకం అంతా కదలి రాజధాని అమరావతికి మద్ధతు తెలపాలని కోరింది. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు కూడా ఈసభను విజయవంతంచేయడంలో భాగం కావాలని పార్టీ కోరింది.

ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టే రాష్ట్ర ద్రోహులకు ఈ సభతో ప్రజలు గుణపాఠం చెప్పాలని ప్ర‌జ‌ల‌కు పిలునివ్వ‌డం గ‌మ‌నార్హం. అమరావతిలో ఉన్న రూ.2 లక్షల కోట్ల సంపదను వైసీపీ ప్రభుత్వం బూడిదపాలు చేసిందని విమ‌ర్శించింది. రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ప్రజలకు భవిష్యత్ ఉంటుందని పేర్కొంది. అభివృద్ధి చేయడం చేతకాక ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని పాలకపక్షం ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ నిప్పులు చెరిగింది.

రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని చెప్పిన మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టంలేక రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని అసెంబ్లీలో చెప్పారు. రాజధాని మార్పు భూములు దోచుకున్నవారికే కావాలని, తమకు కాదని, రాజధానిగా అమరావతి ఉంటుందని ఎన్నికల ముందు ప్రచారం చేసి రాష్ట్ర ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. చెప్పిన మాటపై జగన్ నిలబడరని రాజధాని విషయంలోనే తేలిపోయింది. రోడ్లు వేయడానికి డబ్బులు లేవన్న వ్యక్తి మూడు రాజధానులు ఎలా కడతారో ప్రజలకు సమాధానం చెప్పాలి?`` అని టీడీపీ అదినేత చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

 మేథావుల ముసుగు వేసుకుని కొందరు వైసీపీ సానుభూతిపరులు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని మండిప‌డ్డారు. వైసీపీలో కూడా మూడు రాజధానులపై కొందరు మదనపడుతున్నారని తెలిపారు. అన్ని పార్టీలు అమరావతిని ఏకైక రాజధానిగా కోరుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని పరిశ్రమలను తరిమేసి నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టిన ఈ ప్రభుత్వాన్ని యువత నిలదీయాలని పిలుపునిచ్చారు. రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని, త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో  తెచ్చిన పరిశ్రమలు తప్ప కొత్తవి లేవని బాబు గుర్తు చేశారు.

 వచ్చిన వాటిని కమీషన్ల కోసం తరిమేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకునేది అభివృద్ధి వికేంద్రీకరణ తప్ప..అధికార వికేంద్రీకరణ కాదు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే రాష్ట్రాభివృద్ధికి అడుగులు పడతాయి. జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి వ్యవసాయాన్ని కుదేలు చేశారు. రెండున్నరేళ్లలో రాష్ట్రానికి వైసీపీ ఏం చేసిందో ప్రజలు నిలదీయాలి`` అని ఓ ప్ర‌క‌ట‌న‌లో కోరారు.
Tags:    
  • Amaravati 
  • Farmers 
  • Maha Padayatra 
  • Tirupati 
  • Telugu Desam Party 
  • Chandrababu Naidu 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS