• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భారత రాజ్యంగం 1950 జనవరి...

భారత రాజ్యంగం 1950 జనవరి 26 కంటే ముందే తయారైంది.. కానీ..

By - Tupaki Desk
Update: 2022-01-26 08:58 GMT
భారత రాజ్యంగం అమల్లోకి వచ్చిన దినంగా నేడు దేశ వ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించుకుంటున్నారు. వాడవాడలా.. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. అయితే భారత్ కు జెండా పండుగ రెండు సార్లు వస్తుంది. ఒకటి ఆగస్టు 15... మరొకటి జనవరి 26న. అయితే జనవరి 26న జెండా పండుగ నిర్వహించడానికి భారత రాజ్యంగం అమల్లోకి వచ్చిందని అంటున్నారు. అయితే వాస్తవానికి భారత రాజ్యంగం అంతకముందే పూర్తి చేశారు. అయినా కొన్నాళ్ల పాటు ఆగి చివరికి 1950 జనవరి 26న ఆమోదింపజేశారు. దీంతో ఆ రోజును మనం గణతంత్ర దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. అయితే 1950 జనవరి 26 కంటే ముందు జరిగిన పరిణామాలేంటి..? అసలు భారత రాజ్యాంగం ఎప్పుడు పూర్తయింది..?

1929లో జవహర్ లాల్ నెహ్రు ఆధక్షతన లాహోర్లో కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మొదటిసారిగా పూర్ణ స్వరాజ్ ప్రమాణం చేశారు. ఇందులో భాగంగా 1930 జనవరి 26 నాటికి భారతదేశానికి సార్వ భౌమాధికార హోదా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి  ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే ఆ తరువాత కొన్ని పరిణామాలు జరిగి చివరికి 1930 జనవరి 26న మొదటిసారి పూర్ణ స్వరాజ్ జరుపుకున్నారు. అంటే స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ తరువాత పలు కారణాల వల్ల మళ్లీ జనవరి 26న స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించలేదు. 17 ఏళ్లపాటు ఆగి చివరికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించారు.

అయితే 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆరోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారతదేశ మొదటి గణతంత్ర వేడుకలు 1950 జనవరి 26న నిర్వహించారు. ఉదయం 10.18 గంటలకు భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించడంతో మొదటి రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత తొలి గణతంత్ర దినోత్సవంలో రాజేంద్రప్రసాద్ 21 గన్ సెల్యూట్ తో జాతీయ జెండాను ఎగురవేశారు. అలా అప్పటి నుంచి జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.

దేశం స్వంత రాజ్యంగా ఉండాలని 1947 ఆగస్టు 15 కంటే ముందే నిర్ణయించారు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సాగిన సమావేశాల తరువాత 1949న రాజ్యాంగ సభచే భారత రాజ్యాంగం రూపొందించారు. ఆ తరువాత ఆమోదించడంతో 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా జనవరి 26కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈరోజు అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2001  జనవరి 26న గుజరాత్లో భారీ భూకంపం సంభవించింది. ఇది పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలపై పడింది.
Tags:    
  • Republic Day 
  • Independence Day 
  • Latest news 
  • Tupaki Updates 
  • telugu news 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS