• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉమ్మేస్తున్నారా.. కాస్త...

ఉమ్మేస్తున్నారా.. కాస్త జాగ్రత్త ఇక..

By - Tupaki Desk
Update: 2020-04-09 05:30 GMT

నోట్లో నీళ్లు పోసుకొని.. పాన్, గుట్కా, జర్దా నములుతూ తుపుక్కున ఉమ్మారో మీ పని ఇక ఖతమవుతుంది. కరోనాకు ముందు ఉమ్మితే లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు కరోనా టైంలో ఉమ్మేస్తే మీపై కేసులు, జైలు పాలు కావడం ఖాయం.. సో తెలంగాణలో ఉమ్మే ముందు తస్మాత్ జాగ్రత్త..

కరోనా కల్లోలం తెలంగాణలో కొనసాగుతూనే ఉంది. వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడంతో దాన్ని అదుపు చేయడానికి తెలంగాణ సర్కారు కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.

ఇప్పటికే సీఎం కేసీఆర్ ఖచ్చితంగా ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 7వ తేదీ వరకు తెలంగాణ కరోనా ఫ్రీ అవుతుందని మొదట్లో భావించారు. కానీ ఢిల్లీ తబ్లిగీ ప్రార్థనలతో తెలంగాణ లో వైరస్ విస్తృతంగా వ్యాపించింది. వారికి వారి కుటుంబాలకు, వారు కలిసిన వారికి సోకి ఇప్పుడా సంఖ్య 450 దాటుతోంది.

దీంతో తెలంగాణలో కేసీఆర్ సర్కారు కఠిన నిబంధనలు అమలు చేయడానికి సిద్ధమైంది.  ఇక నుంచి తెలంగాణలో బహిరంగ ప్రదేశాల్లో పాన్, తంబాకు ఉమ్మివేయడాన్ని.. అలాగే కామన్ గా కూడా ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తున్నట్టు ప్రకటించింది.

కరోనా వైరస్ ప్రధానంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా, ఉమ్మివేయడం ద్వారా, తెమడ ద్వారా వ్యాపిస్తుంది. దీన్ని ఐసీఎంఆర్ కూడా తాజాగా తెలిపింది. ఈ నేపథ్యం లో తెలంగాణ సర్కారు కఠిన నిబంధనలను తెలంగాణ లో అమలుకు నిర్ణయించింది. 
Tags:    
  • Telangana bans spitting in public places 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS