• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ రూలే లేకుండా ‘అసెంబ్లీ’...

ఆ రూలే లేకుండా ‘అసెంబ్లీ’ గురించి ఆలోచించే వారే కాదేమో?

By - Tupaki Desk
Update: 2021-09-06 01:11 GMT
మరోసారి తెలంగాణాలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల చర్చ మొదలైంది. దీనికి కారణం.. ఆ మధ్యన బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన సభ ముగిసి దగ్గర దగ్గర ఆర్నెల్లు కావొస్తోంది. దీంతో.. దీనిప్రస్తావన వచ్చింది. నిబంధనల ప్రకారం ప్రతి ఆర్నెల్లకు ఒక దఫా తప్పనిసరిగా సమావేశాల్ని నిర్వహించి ఉంటుంది. తాజాగా ఉన్న లెక్కల ప్రకారం చూస్తే.. ఈ నెల 26లోపు కచ్ఛితంగా సమావేశాల్ని నిర్వహించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో.. అసెంబ్లీ సమావేశాల గురించి అసలు ఆలోచించే వారే కాదేమో?

ఈ ఏడాది మార్చి 15 నుంచి 26 వరకు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఆర్నెల్లకు ఒకసారి అసెంబ్లీ సమావేశాన్ని కొలువుతీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ లెక్కన చూస్తే.. ఈ నెల 26 లోపు సభను నిర్వహించాలి. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు మార్చిలో.. వర్షాకాల సమావేశాలు జులై.. ఆగస్టు నెలల్లో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే.. కరోనా కారణంగా సమావేశాలు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నా.. అందులో పస లేదనే చెప్పాలి.

ఎందుకంటే.. ఇదే ప్రభుత్వం వేలాది మందితో భారీ సభల్ని నిర్వహించటం.. పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టటం.. ఘనంగా ప్రారంభోత్సవాలు చేపట్టే విషయంలో లేని ఇబ్బంది అంతా.. పరిమిత సంఖ్యలో సమావేశాల్ని నిర్వహించేందుకు వచ్చిన కష్టం ఏమిటో ఒక పట్టాన అర్థం కాదు. రూల్ ఉంది కాబట్టి.. ఈ మాత్రమైనా అసెంబ్లీ సమావేశాల గురించి చర్చ జరుగుతుంది కానీ.. లేకుండా అలానే వదిలేసే వారేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా వర్షాకాల సమావేశాల్ని వారం నుంచి పది రోజుల వరకు జరిపే వీలుంది.

అయితే..మొన్నటివరకు అసెంబ్లీ సమావేశాల గురించి ఆలోచించని సర్కారు.. ఇప్పుడు హటాత్తుగా ఇంత ప్రాధాన్యత ఇవ్వటానికి కారణం.. రూల్ ప్రకారం సభను నిర్వహించాల్సి ఉండటమే. దీనికి సంబంధించిన విషయాన్ని మర్చిపోయిన అధికారులు.. తాజాగా గడువు గుర్తుకు రావటంతో హడావుడిగా పనులు మొదలు పెట్టినట్లుగా చెబుతారు.

అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో ఉండటంతో.. ఆయన హైదరాబాద్ కు తిరిగి వచ్చినంతనే.. ఆయన ముందు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అంశాన్ని ముందు ఉంచుతారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ నెల 15 నుంచి 20 మధ్యలో సమావేశాల్ని నిర్వహించి.. రూల్ బుక్ ను పక్కాగా ఫాలో అవుతున్నట్లుగా చెప్పుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Tags:    
  • telangana 
  • kcr 
  • trs Party 
  • Telangana Assembly 
  • Telangana Assembly sessions 
  • Political News 
  • Breaking News 
  • Latest News 

Similar News

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

Copyright @2026

Powered by Blink CMS