కోస్తా కుస్తీ : వైసీపీ టీడీపీ ఢీ అంటే ఢీ...?

Update: 2022-03-28 02:30 GMT
ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నది తేల్చేసేవి కోస్తా జిల్లాలు అంటున్నారు. దానికి గతంలో లెక్కలు కూడా ఉదాహరణలుగా తీసుకోవాలి. 2014లో చంద్రబాబు నాయకత్వాన టీడీపీ కోస్తా అంతటా దున్నేసింది. కేవలం గ్రేటర్ రాయలసీమ వరకు మాత్రమే వైసీపీ పరిమితం అయిపోయింది.  దాంతో అధికారం టీడీపీ పరం అయింది.

ఇక 2019 నాటికి బొమ్మ కాస్తా  తిరగబడింది. వైసీపీ గ్రేటర్ రాయలసీమలో పట్టుని నిలుపుకుంటూనే కోస్తా జిల్లాలను కూడా చుట్టుముట్టేసింది. దాంతో బంపర్ మెజారిటీతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇపుడు చూస్తే మరో మారు కోస్తా జిల్లాలే ఈ రెండు పార్టీలకు కీలకం అవుతున్నాయని అంటున్నారు.

కోస్తా జిల్లాలుగా చెప్పుకుంటే ఉత్తరాంధ్రా, ఉభయగోదావరి, క్రిష్ణా, గుంటూరు దాకా ఏడు జిల్లాలుగా పేర్కొనాలి. ఈ జిల్లాలలో మొత్తం సీట్లు కలుపుకుని 101 ఉన్నాయి. అంటే వీటిలో మెజారిటీ సీట్లు తెచ్చుకుంటేనే ఏ పార్టీ అయినా అందలం ఎక్కగలదు అన్న మాట.

ఇక క్లియర్ గా చెప్పుకుంటే టోటల్ 175 సీట్లలో 101 సీట్లు ఇక్కడే ఉన్నాయి. పైగా బీసీలు, కాపులు, కమ్మ సామాజిక వర్గాలు  కూడా ఇక్కడ డామినేటింగ్ రోల్ ప్లే చేస్తాయి.  చంద్రబాబు ఈసారి కోస్తా కుస్తీకి  ముందే కసరత్తు చేస్తున్నారు. 2014 రిజల్ట్ రిపీట్ కావాలని ఆయన పరితపిస్తున్నారు. అలా జరగాలంటే గతంలో మాదిరిగా బీసీలు, కాపులు, కమ్మలు ఏకత్రాటి మీదకు రావాలి. సోషియో, పొలిటికల్ పోలరైజేషన్ జరగాలి.

ఆ విషయంలో టీడీపీ ముందు చూపుతోనే ఉంది. జనసేనతో పొత్తు పెట్టుకోవడం ద్వారా గోదావరి, జిల్లాలతో పాటు క్రిష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా సొషియో ఈక్వేషన్స్ మార్చాలని చూస్తోంది. ఇక బీసీలను కూడా దువ్వుతోంది. అన్నీ కలసివస్తే టీడీపీ ఈసారి భారీ సీట్లను కొల్లగడుతుంది అని భావిస్తున్నారు.

టీడీపీ వ్యూహాలకు ధీటైన స్ట్రాటజీని వైసీపీ కూడా అమలు చేస్తోంది. ఆ పార్టీ కూడా బీసీలు కాపులు, కమ్మల ఈక్వేషన్ ని నమ్ముకుంటోంది. అందుకే మంత్రి వర్గ విస్తరణలో  సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణను పక్కన పెట్టి ఆయనకు కోస్తా జిల్లాల పార్టీ బాధ్యతలను అప్పగిస్తారు అని అంటున్నారు.

ఆయన ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన బీసీ కాపు నేత. ఆయనకు ఉత్తరాంధ్రా, ఉభయ గోదావరి జిల్లాల దాకా పట్టూ పలుకుబడి ఉంది. ఇక పీసీసీ చీఫ్ గా పనిచేయడం వల్ల గుంటూరు, క్రిష్ణా రాజకీయల మీద అవగాహన ఉంది.

మరోవైపు ఆయనతో పాటుగా  క్రిష్ణా జిల్లా నుంచి కొడాలి నానిని దింపాలని వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. కొడాలి నానిని కమ్మలకు ప్రతినిధిగా వైసీపీ చూపిస్తోంది. ఆయన కూడా శక్తివంచన లేకుండా కమ్మలకు సేఫెస్ట్ పార్టీ వైసీపీయే అని చాటి చెబుతున్నారు. కొడాలి నానిని కూడా మంత్రి పదవి నుంచి పక్కకు పెట్టి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు.

అలా నానికి క్రిష్ణా, గుంటూరులతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కమ్మ సామాజిక వర్గాన్ని వైసీపీ వైపుగా లాగే బాధ్యతలను అప్పగిస్తున్నారు అని అంటున్నారు. మొత్తం  మీద చూస్తే 101 సీట్లు ఏపీ జాతకాన్ని మార్చే సీట్లు, ఎవరు సీఎం కావాలో తేల్చేసే సీట్లు. దాంతో కోస్త్ కుస్తీ ఆసక్తికరంగా మారుతోంది అంటున్నారు.
Tags:    

Similar News