ఉత్తరాంధ్రాలో వైసీపీ, టీడీపీ హోరా హోరీ ?
ఏపీలో ఏ పార్టీ గెలవాలన్నా అధికార పీఠం పట్టాలన్నా ఉత్తరాంధ్రా జిల్లాలు చాలా ముఖ్యం. మొదటి నుంచి కూడా ఈ రాజకీయ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతోంది. 2014లో చూసుకుంటే చంద్రబాబు సీఎం కావడానికి ఉత్తరాంధ్రాలో మెజారిటీ సీట్లే కారణం. ఇక 2019లో జగన్ బంపర్ విక్టరీ కొట్టడానికి కూడా ఉత్తరాంధ్రా జై కొట్టడమే రీజన్ అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో 28 సీట్లను గెలుచుకుని వైసీపీ గత ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. కేవలం ఆరు సీట్లతోనే టీడీపీ సరిపెట్టుకుంది. అయితే మూడేళ్ల వ్యవధి తరువాత పొలిటికల్ సీన్ అయితే మారింది అని చెప్పాలి.
టీడీపీకి కంచుకోట లాంటి ఈ జిల్లాలలో ఆ పార్టీ మెల్లగా పుంజుకుంటోంది. అదే విధంగా నాయకులు కూడా యాక్టివ్ అవుతున్నారు. జనాల్లో కూడా మార్పు వస్తోంది. ఈ పరిణామాల నేపధ్యంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అన్నది కనుక చూసుకుంటే అధికార పార్టీతో విపక్ష తెలుగుదేశం ఢీ అంటే ఢీ అంటోంది.
ఈ రోజుకు కనుక ఎన్నికలు జరిగితే కచ్చితంగా హోరా హోరీ పోరు తప్పదనే అంటున్నారు. మొత్తం 34 సీట్లలో చెరి సగం గెలుచుకునే పరిస్థితి ఉందని అంటున్నారు. అంటే ఈమేరకు అధికార వైసీపీ ఏకంగా 11 సీట్లను కోల్పోయే అవకాశం ఉందన్న మాట.
మరి ఆ సీట్లు ఏంటి అంటే విశాఖ జిల్లాలో భీమిలీ అని ఫస్ట్ పేరు వస్తోంది. అలాగే మరో సీటుగా గాజువాక పేరు చెబుతున్నారు. ఇక పాయకరావుపేట ముచ్చటగా మూడవ స్థానం అని లెక్కలు వేస్తున్నారు. ఇక ఎలమంచిలిలో కూడా వైసీపీకి చిక్కులే అని చెబుతున్నారు. ఏజెన్సీలో ఈసారి అంటే రెండు దశాబ్దాల తరువాత పాడేరులో టీడీపీ జెండా ఎగురుతుందా అంటే అవును అనే చెప్పాలని అంటున్నారు.
ఇక విజయనగరం జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లను క్లీన్ స్వీప్ చేసి పారేసింది. కానీ ఇపుడు ఎన్నికలు జరిగితే టీడీపీ మూడు నుంచి నాలుగు సీట్లు కైవశం చేసుకోవడం ఖాయమని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కురుపాం సీటుతో పాటు, నెల్లిమర్ల, పార్వతీపురం సీట్లు ఈసారి డౌటే అంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే మొత్తం పది సీట్లలో రెండు టీడీపీ గత ఎన్నికల్లో గెలుచుకుంది. ఈసారి దానికి మరో మూడు కలసి వస్తాయని అంటున్నారు. అవి ఆముదాలవలస, శ్రీకాకుళం, పాతపట్నం సీట్లు అని కచ్చితంగా చెబుతున్నారు. మరీ ఊపు వస్తే పాలకొండ కూడా సైకిల్ దే అవుతుంది అని కూడా చెబుతున్నారు.
ఇలా చూసుకుంటే గతంలో టీడీపీ గెలిచిన ఆరింటినీ నిలబెట్టుకుంటూ మరొ పదకొండు సీట్లు గెలుచుకునే పరిస్థితులలో ఉండడం విశేషం. దీన్ని బట్టి చూస్తే అధికార వైసీపీ జాగ్రత్త పడకపోతే మరో రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు ఇంకా మారిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.