• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమీర్ ఖాన్ ఇన్నాళ్లూ...

అమీర్ ఖాన్ ఇన్నాళ్లూ నటించాడన్న మాట

By - Tupaki Desk
Update: 2015-11-25 10:35 GMT
అసలు రంగు బయటపెట్టుకున్న అమీర్ ఖాన్ పై అందరి నుంచీ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఒక్కరు కూడా ఇంతవరకు అమీర్ ఖాన్ కు మద్దతుగా మాట్లాడలేదు. తాజాగా బంగ్లాదేశ్ కు చెందిన సంచలన రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా అమీర్ కు చీవాట్లు పెట్టారు. ఆమె చేసినట్లుగా  కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నప్పటికీ అవి ఆమె చేసినవి కావట... ఆ సంగతి తస్లీమాయే స్వయంగా వెల్లడించారు.. అయితే.. ఆ సందర్భంలో ఆమె అమీర్ కు హితవు పలకడం విశేషం. ''అమీర్ పై నేను చేసినట్లుగా సోషల్ మీడియాలో ఉన్న వ్యాఖ్యలు నావి కావు.. అయితే.. అమీర్ ఖాన్ కు ఒక విషయం చెప్పదలచుకున్నాను. ఆయన, ఆయన కుటుంబం ఉండడానికి ఇండియా కంటే భద్రమైన దేశం  ఇంకొకటి మాత్రం ఉండదు'' అని తస్లీమా అన్నారు.

తస్లీమా వ్యాఖ్యల్లో ఎంతో నిజం ఉంది. లజ్జ నవల తరువాత ఆమెకు ఎక్కడా రక్షణ లేకపోతే ఇండియాలో తలదాచుకోగలిగింది. ఆమే కాదు.. ఆమెలా ఎందరో ఇండియాలో బతికిబట్టకట్టారు. ఇండియాకు వచ్చి పేరు తెచ్చుకున్నారు. ఇండియా ఎంత భద్రమైన దేశమో చెప్పడానికి దలైలామా కూడా పెద్ద ఉదాహరణ. ఇండియాయే అక్కున చేర్చుకోకుంటే దలైలామా పరిస్థితి ఎలా ఉండేదో వేరే చెప్పనవసరం లేదు.

అద్నాన్ సమీది మరో కథ. పాకిస్థాన్ కు చెందిన ఈ గాయకుడి ఇండియాలో ఎంత ఆదరణ ఉందో తెలియంది కాదు. అందుకే ఆయన ఇండియాలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నారు. చాలాకాలం కిందటే అద్నాన్ ఒక ఇంటర్వ్యూ లో  ఒక మాట చెప్పారు...  అమీర్ వంటి వారికి దాన్ని వినిపించేవారుంటే బాగుణ్ను. పాకిస్థాన్ లో పుట్టిన అద్నాన్ ప్రతిభావంతుడైన గాయకుడు.. పాక్ లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకు పేరు రాలేదు. పేరు రావాలంటే అమెరికాయో - ఇంగ్లండో - కెనడాయో వెళ్లాల్సిందేనని ఎవరో చెబితే అదీ ట్రై చేశాడు. కెనడాలో చాలాకాలం ప్రయత్నాలు చేశాడు. అక్కడా గుర్తింపు రాలేదు. ఆ తరువాత అనుకోకుండా ఇండియా వచ్చాడు. ఆయన గొంతులో పలికే విషాదం, జీర భారతీయ సంగీతాభిమానులకు  నచ్చింది. ఆయన ఆల్బమ్ లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.  ఇండియా మెచ్చిన గాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. సక్సెస్, పేరు కోసం ప్రపంచమంతా తిరిగినా ఫలితం రాలేదని.. ఇండియాకు వచ్చిన తరువాత తన పేరు ప్రపంమంతా మారుమోగిపోయిందని అద్నాన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు... సక్సెస్ కోసం ఎక్కడికో ఎందుకు వెళ్తారు.. ఇండియాకు వచ్చేయండి అంటూ పిలుపిచ్చాడు కూడా. ఇప్పటికీ అద్నాన్ కు ఉన్న ఆదరణ - క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పాకిస్తాన్ కు చెందిన అద్నాన్ తనకు జీవితాన్ని, పేరుప్రఖ్యాతులను ఇచ్చిన ఇండియా పట్ల చూపిన అభిమానం, విశ్వాసంలో కనీసం ఒక శాతం చూపించినా అమీర్ ను ప్రజలు క్షమించేవారేమో... ఇండియా ఎంత భద్రమైనదో బంగ్లాదేశ్ కు చెందిన తస్లీమా నస్రీన్ కు అర్థమైనట్లుగా అమీర్ కు కూడా అర్థమైతే ఈ ఆవేదనే ఉండేది కాదేమో. ఇన్నాళ్లూ అభిమానించిన హీరో్ ఇలాంటివాడా అని ఎందరో హతాశులయ్యారు. అయితే... అమీర్ వ్యాఖ్యలతో భారతదేశం, ప్రపంచానికి కూడా ఒక విషయం అర్థమైంది. అది.. అమీర్ ఇన్నాళ్లూ ముసుగేసుకున్నాడని... ఒళ్లంతా విద్వేషాన్ని నింపుకుని 'నటించాడని'. అవును... అందరం ఒప్పుకుందా అమీర్ ఖాన్ గొప్ప నటుడే
Tags:    
  • Taslima Nasreen 
  • Aamir Khan Intolerance 
  • Telugu News 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS