• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎన్నికల వేళ సంచలనం.....

ఎన్నికల వేళ సంచలనం.. తమిళనాడులో నోట్ల కట్టలు సీజ్​..!

By - Tupaki Desk
Update: 2021-04-06 12:45 GMT
ప్రస్తుతం ఎన్నికలంటేనే డబ్బు చుట్టూ  తిరుగుతున్నాయి. పోలింగ్​ కు ముందురోజు భారీగా డబ్బులు పంచడం.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం కామన్​. ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటుచేసి .. ద్వితీయశ్రేణి నాయకుల ద్వారా డబ్బులను పంపిణీ చేయడం రాజకీయనాయకులకు అలవాటు. ఇదిలా ఉంటే తాజాగా తమిళనాడులో భారీగా డబ్బు నగదు పట్టుబడింది. భారీగా అంటే వందల కోట్ల నగదు. కిలోల కొద్దీ బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్​ చేశారు. ఈ డబ్బు డీఎంకే అధినేత స్టాలిన్​ బంధువుదే అన్న ప్రచారం కూడా సాగింది.

నాలుగు వందల కోట్లకు పైగా నగదు, బంగారం అధికారులు సీజ్​ చేసుకున్నారు.  ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బును ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ఎన్నికలంటే పోల్​ మేనేజ్​మెంట్​. పోల్​ మేనేజ్​మెంట్​ తెలిసిన వాడే కింగ్​. అంటే ఓటర్లను పోలింగ్​ స్టేషన్​ తీసుకెళ్లి ఓట్లు వేయించగలిగిన సత్తా ఉన్నవాడే హీరో. అటువంటి వాళ్లు అన్ని పార్టీలకు పుష్కలంగా ఉంటారు. పోలింగ్​ ముందురోజు ఓటర్లకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం.. విందు వినోదాలు అందించడం.. కావాల్సిన డబ్బు ఇవ్వడం.. ఇతరత్రా కానుకలు ఇవ్వడం ఆ తర్వాత పోలింగ్​ బూత్ కు తీసుకెళ్లడం. ఇది ఏ పార్టీ సమర్థవంతంగా చేయగలిగితే వారిదే గెలుపు.

ఇదిలా ఉంటే తమిళనాడులో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన నగదు రూ.225.5 కోట్లు, సుమారు రూ.176 కోట్ల విలువైన బంగారాన్ని ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. మద్యం, గృహోపకరణాలు  పట్టుబడ్డట్టు సమాచారం. వీటి మొత్తం విలువ రూ.428 కోట్లు ఉంటుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు.

చెన్నై, కోయంబత్తూరు, తిరుప్పూర్ తదితర చోట్ల అధికారులు దాడులు నిర్వహించారు. అత్యధికంగా కరూర్‌ లో భారీగా నగదు పట్టుబడింది. ఆ తర్వాత కోయంబత్తూరు, తిరుప్పూర్, చెన్నైలలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.అలాగే రాణిపేట జిల్లాలో రూ.91 లక్షలు, చెన్నై నగరంలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో సుమారు రూ1.15 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు.
Tags:    
  • Tamilnadu 
  • Tamilnadu Elections 
  • Tamilnadu Assembly Elections 2021 
  • Telugu News 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS