మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ ..ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం !

Update: 2020-07-14 05:30 GMT
కరోనా దెబ్బకి దేశం మొత్తం భయంతో వణికిపోతోంది. సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు ... రాజకీయ ప్రముఖల నుండి అధ్యక్షుల వరకు అందరూ కరోనా భారిన పడుతుండటంతో రోజురోజుకి ఆందోళన పెరిగిపోతుంది. ఇప్పటికే ఇండియా లో కరోనా కేసుల సంఖ్య 9 లక్షలు దాటిపోయింది. అలాగే కరోనా కారణంగా ఇప్పటివరకు దాదాపుగా 24 వేలమంది మరణించారు. అలాగే ఇంకా రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది.

ఈ తరుణంలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు  నమోదు అవుతున్నాయి అని ,తమిళనాడు సర్కార్ జులై చివరి వరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తుంది. అలాగే కర్ణాటక లో కూడా రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఈ రోజు నుండి జులై 23 వరకు పూర్తీ స్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాలనీ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  తాజాగా మరో రాష్ట్రం  కూడా అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీహార్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో మళ్లీ  పూర్తిస్థాయి లాక్‌ డౌన్‌ విధించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.

 దీనిపై  ఓ నిర్ణయం తీసుకోవడానికి  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మరిన్ని చర్యల గురించి సమీక్షించ‌నున్నారు. ఇక  , బీహార్‌ లో కరోనా కేసులు అత్య‌ధికంగా న‌మోద‌వుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో కొత్తగా 1,116 కరోనా కేసులు గుర్తించినట్లుగా ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల‌ సంఖ్య 17,421 కు పెరిగింది.
Tags:    

Similar News