పెళ్లి మండపానికి వెళుతున్న పెళ్లికొడుకుపై కత్తిపోట్లు..కట్ చేస్తే షాకింగ్ నిజం

ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో? అర్థం కాని విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు వెళుతున్న తీరు ఆందోళనకు గురి చేస్తోంది.;

Update: 2026-02-03 04:11 GMT

ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో? అర్థం కాని విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు వెళుతున్న తీరు ఆందోళనకు గురి చేస్తోంది. నచ్చని పెళ్లి నచ్చలేదని చెబితే సరిపోతుంది. ఇష్టం లేని కాపురానికి విడాకులతో బయటకు వచ్చేస్తే అక్కడితో ఆ కథ సమాప్తం. నచ్చినోడితో ఉండొచ్చు. లేదంటే పెళ్లి చేసుకోవచ్చు. అందుకు భిన్నంగా క్రైం సీన్ కు ప్లాన్ చేసి.. ఎవరినో చంపేసి.. తాము సుఖంగా ఉండాలనుకునే మైండ్ సెట్ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే.

కర్ణాటకలోని కొళ్లేగాల పట్టణ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం షాకింగ్ గా మారింది. ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగి అయిన రవీశ్ కు పెళ్లి నిశ్చయమైంది. తెల్లారితే పెళ్లి. వివాహానికి ముందుగా నిర్వహించే రిసెప్షన్ కోసం ఉత్సాహంగా పెళ్లి మండపానికి కారులో వెళుతున్నాడు. అనూహ్యంగా అతను ప్రయాణిస్తున్న కారును మరో కారులోని వారు వెంటాడి.. కారును అడ్డగించారు.

అనంతరం అతడిపై విచక్షకరహితంగా దాడి చేశారు. కత్తులతో పొడిచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడకు చేరుకున్న పెళ్లికుమార్తె పరుగున వచ్చి.. భోరున విలపించింది. ఆమె తీరు అసహజంగా ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. కట్ చేస్తే.. విచారణ షురూ చేసిన వారికి ఫజిల్ వీడిపోవటమే కాదు. షాకింగ్ నిజాల్నివెలుగులోకి తీసుకొచ్చారు.

పెళ్లి కుమారుడు రవీశ్ మీద దాడి చేసింది మరెవరో కాదు.. పెళ్లి కుమార్తె ప్రియుడుగా తేల్చారు. పెళ్లి కుమార్తె ఊరికి చెందిన దర్శన్ అనే డప్పు కొట్టే వ్యక్తితో ఆమె ప్రేమలో ఉంది. దీంతో ఆమె ఇష్టానికి భిన్నంగా జరుగుతున్న పెళ్లిని అడ్డుకోవటానికి పెళ్లికొడుకు మీద దాడి చేసేలా ప్లాన్ చేశారు. ఆసుపత్రికి చేరుకున్న ఆమె.. గాయాల బారిన పడిన రవీశ్ ను పెళ్లి చేసుకోవాలని అభ్యర్థించింది. అయితే.. తనపై దాడి వెనుక ఏదో కుట్ర ఉందని భావించిన అతను పెళ్లి కుమార్తె ప్రపోజల్ ను తిరస్కరించాడు. అంతలో పోలీసులు కుట్ర కోణాన్ని చేధించారు. సరైన సమయంలో ఆసుపత్రికి చేరటంతో రవీశ్ కు ప్రాణాపాయం తప్పింది.

Tags:    

Similar News