• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లాజిక్ తో కొట్టిన...

లాజిక్ తో కొట్టిన బాబు...కొత్త పేరు పెట్టిన జగన్ !

| స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చంద్రబాబు, జగన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. వైసీపీ చతికిలపడిందని, కూటమికి 25 శాతం ఓట్ల ఆధిక్యం వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లపై వైసీపీ విమర్శలను తప్పుబట్టారు. దీనిపై జగన్ స్పందిస్తూ చంద్రబాబును 'రిగ్గింగ్ మాస్టర్' అంటూ విమర్శించారు. 'హే రామ్.. సేవ్ ఆంధ్రా' అంటూ ట్వీట్ చేశారు.

By - Satya P
Update: 2026-11-10 03:49 GMT

స్థానిక సంస్థల ఎన్నికలు కాదు కానీ టీడీపీ వైసీపీల మధ్యన డైలాగ్ వార్ ఒక రేంజిలో సాగుతోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు జగన్ పరస్పర విమర్శలు చేసుకుంటున్న ఆరోపణలు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైసీపీ చతికిలపడి పోయింది అంటూ బాబు తాజా ప్రెస్ మీట్ లో హాట్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆయన ఆగలేదు. ఫలితాలు మొత్తం వివరాల చిట్టా కూడా చదివి వినిపించారు. రెండు పార్టీల మధ్య ఏకంగా పాతిక శాతం ఓటు షేర్ తేడా ఉందని చెప్పి ఇక వైసీపీకి ఏపీలో నో చాన్స్ అనేశారు. ఎన్డీయేకి పాజిటివ్ ఓటు వైసీపీ నుంచి నెగిటివ్ ఓటు కూడా కలిసి మరింతగా బలపడింది అని బాబు విశ్లేషించారు.

వైసీపీని ఇరికించేశారు :

ఇక ఇదే ప్రెస్ మీట్ లో చంద్రబాబు చాలా విషయాలే చెప్పారు. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తే ట్యాంపరింగ్ చేశారు అని వైసీపీ వాళ్లు అంటారని అదే బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహిస్తే రిగ్గింగ్ అంటారని ఆగ్రహించారు. గెలవలేక మాట్లాడే మాటలు ఇవన్నీ అంటూ కొట్టి పారేశారు. ఏ పద్ధతిలో ఎన్నికలు ఏపీలో నిర్వహించినా కూడా కూటమి గెలుస్తోందని అంతే కాదు భారీ ఎత్తున ఓటు బ్యాంక్ ని కూడా పెంచుకుంటోంది అని అన్నారు. బాబు ఈ విధంగా మాట్లాడటం ద్వారా వైసీపీకే కాదు సగటు జనానికి కూడా ఆలోచనలు రేకెత్తించారు అని అంటున్నారు. ఈవీఎం లు కాక బ్యాలెట్ పేపర్ కూడా కాకపోతే అసలు ఏ విధంగా ఎన్నికలు పెడతారు అన్నది కూడా సగటు జనం అనుకుంటారు కదా. రాజకీయాల్లో వ్యూహాలు ఎన్నో ఉంటాయని వాటిని ధీటుగా వైసీపీ ఎదుర్కోవాల్సిందే అని కూడా జనం నుంచి వచ్చే మాటగా కూడా ఉంటోంది.అందుకే తమ విజయాలను గట్టిగా చెప్పుకోవడానికే ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా అంటూ బాబు పోలిక తెచ్చారు అని అంటున్నారు. దీనికి జవాబు చెప్పడం వైసీపీకి ఇబ్బందిగానే ఉంటుందని అంటున్నారు.

జగన్ సంచలన కామెంట్స్ :

అయితే వైసీపీ అధినేత జగన్ ఈ విషయంలో అసలు ఊరుకోవడం లేదు. ఆయన మొదటి నుంచి కూడా కూటమి మీద గట్టిగానే విరుచుకుపడుతున్నారు. అసలు వైసీపీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం వెనక కూడా కూటమిని వీలైనంత వరకూ ఎక్స్ పోజ్ చేయాలి వారి ఎన్నికల అక్రమాలు ఇవీ అని జనాలకు చాటాలన్న ప్రయత్నం ఉందని అంటున్నారు. బాబు ప్రెస్ మీట్ పూర్తి కావడంతోనే జగన్ ఒక సంచలన ట్వీట్ చేశారు. అందులో గొర్రె తోలు కప్పుకున్న తోడేలు చంద్రబాబు ఒకటేనని ఘాటుగా విమర్శించారు. ఇక రిగ్గింగ్ మాస్టర్ అంటూ బాబుకు కొత్త పేరు పెట్టారు. చంద్రబాబు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెబుతుంటే ప్రజలు నివ్వెర పోతున్నారని జగన్ సెటైర్లు వేశారు.ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించారని పరోక్షంగా ఆరోపిస్తూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఇక తన ట్వీట్ చివరలో హే రామ్.. సేవ్ ఆంధ్రా అంటూ జగన్ పేర్కొన్నారు. ఏకంగా రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు అనే హ్యాష్‌ట్యాగ్‌తో జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. దాంతో దీని మీద కూటమి నుంచి ఏ విధంగా కౌంటర్లు వస్తాయో చూడాల్సి ఉంది.

Tags:    
  • chandrababu 
  • jagan 
  • tdp 
  • ysrcp 
  • aplocalbodyelections 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS