• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అయ్యప్ప దీక్షలో ఉన్న...

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

| హైదరాబాద్ ఆదిభట్లలోని టీసీఎస్ కార్యాలయం వద్ద అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగిని లోపలికి అనుమతించలేదన్న ఆరోపణలతో వివాదం చెలరేగింది. రెండేళ్లుగా సంస్థలో పనిచేస్తున్న మణీష్.. రెండు నెలల ముందే దీక్ష విషయం యాజమాన్యానికి చెప్పానని, సంప్రదాయ దుస్తులతో వెళ్లగా అడ్డుకున్నారని ఆరోపించాడు. అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు నిరసనకు దిగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. సమస్య పరిష్కారమైందని, మతపరమైన కోణం లేదని పోలీసులు తెలిపారు.

By - A.N.Kumar
Update: 2026-11-20 05:06 GMT

కార్పొరేట్ సంస్కృతి వేరు.. వ్యక్తిగత భక్తిప్రవత్తులు వేరు.. ఈ రెండింటి మధ్య అంతులేని దూరం ఉంటుంది. అయితే భక్తుల మతవిశ్వాసాలను అందరూ గౌరవించాలి. మన దేశంలోని ఏ సంస్థకు అయినా మన ఆచార వ్యవహారాలు తెలుసు. ఈ విషయంలో మత సహనం అనేది పాటించాలి. కానీ మన సంస్థలే మన ఆచార వ్యవహారాల విషయంలో అడ్డంకులు సృష్టిస్తే.. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది.

అయ్యప్ప దీక్షలో ఉన్నానని చెప్పిన ఓ ఉద్యోగి విషయంలో టీసీఎస్ కార్పొరేట్ కంపెనీ వ్యవహరించిన తీరు వివాదమైంది. దీక్షలో ఉన్నానని చెప్పినా ఓ ఉద్యోగిని టీసీఎస్ కార్యాలయంలోకి అనుమతించలేదన్న ఆరోపణలు హైదరాబాద్ లో కలకలం రేపాయి. దీంతో అయ్యప్ప భక్తులు.. హిందూ సంఘాలు ఆ కంపెనీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారం ముదిరిపాకాన పడింది. పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉద్యోగం అంటే కేవలం జీతం తీసుకోవడం మాత్రమే కాదు.. సంస్థ నిబంధనలను పాటించడం కూడా.. అదే సమయంలో ఉద్యోగికి తన వ్యక్తిగత విశ్వాసాలు.. సంప్రదాయాలను అనుసరించే స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం కుదరకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడానికి హైదరాబాద్‌లోని టీసీఎస్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘటన ఉదాహరణగా నిలిచింది.

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కార్యాలయం వద్ద గురువారం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయ్యప్ప దీక్షలో ఉన్నందుకు తనను కార్యాలయంలోకి అనుమతించలేదంటూ మణీష్ అనే ఉద్యోగి చేసిన ఆరోపణ ఈ వివాదానికి కారణమైంది. విషయం బయటకు రావడంతో పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు.. హిందూ సంఘాల ప్రతినిధులు కార్యాలయం ఎదుటకు చేరుకున్నారు. కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.

మణీష్ గత రెండేళ్లుగా టీసీఎస్‌లో పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. తాను అయ్యప్ప దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్న విషయాన్ని రెండు నెలల ముందుగానే కంపెనీ యాజమాన్యానికి తెలియజేశానని చెప్పాడు. అయితే గురువారం దీక్షకు సంబంధించిన సంప్రదాయ దుస్తులతో కార్యాలయానికి వెళ్లిన సమయంలో గేటు వద్దే తనను అడ్డుకున్నారని ఆరోపించాడు. అయితే ఇదే నిబంధనను ఇతర ఉద్యోగుల విషయంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించాడు. తన విషయంలోనే ప్రత్యేకంగా అభ్యంతరం వ్యక్తం చేయడం ఏమిటని నిలదీశాడు.

విషయం తెలుసుకున్న అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల కార్యకర్తలు టీసీఎస్ కార్యాలయం ఎదుటకు చేరుకుని నిరసన తెలిపారు. దీక్షలో ఉన్న ఉద్యోగిని విధులకు అనుమతించాలని డిమాండ్ చేశారు. వివాదం ముదరడంతో ఆదిభట్ల పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఉద్యోగి కంపెనీపై చేసిన ఆరోపణల నేపథ్యంలోనే నిరసన జరిగిందని.. ఈ వ్యవహారంపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని.. పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. సమస్య పరిష్కారమైందని.. ఇందులో మతపరమైన కోణంలో లేదని పోలీసులు ప్రకటించారు.

ప్రైవేట్ కంపెనీల్లో డ్రెస్ కోడ్ తప్పనిసరి.. కానీ మతపరమైన ఆచారాల్లో కంపెనీలు ఒక విధానాన్ని ఆచరిస్తే ఇలాంటివి పునరావృతం కావు. ఉద్యోగుల విశ్వాసాలను గౌరవిస్తూనే క్రమశిక్షణ పాటించాలి. నిజానికి ఇది కేవలం టీసీఎస్ కు సంబంధించిన అంశం మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్న కార్పొరేట్ సంస్థల్లో ఇలాంటి వాటిపై నిబంధనలు.. ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.

Tags:    
  • tcs 
  • ayyappadeeksha 
  • hyderabadnews 
  • adibatla 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS