• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బీఆర్ఎస్ కి రాజకీయ...

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

| 43 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న సిద్ధిపేటపై సీఎం రేవంత్ రెడ్డి గురిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని, ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. మామ కాకపోతే అల్లుడు.. ఎంతకాలం వారేనా అంటూ కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌లపై విమర్శలు గుప్పించారు.

By - Satya P
Update: 2026-11-20 03:35 GMT

సిద్ధిపేట. కేసీఆర్ కుటుంబానికి రాజకీయ సిద్ధిని ప్రసాదించిన ప్రాంతం. కేసీఆర్ 1983లో తొలిసారి పోటీ చేసి ఓటమి చెందినా 1985 నుంచి కల్వకుంట్ల కుటుంబానికి అడ్డాగా మారిన సీటు అది. కేసీఆర్ అయితే 1985, 1989, 1994, 1999, 2001, 2004 లలో వరసగా గెలిచారు. ఇక 2004 లో ఆయన ఎంపీగా పోటీ చేయడంతో సిద్ధిపేట నుంచి ఉప ఎన్నికల్లో ఆయన మేనల్లుడు హరీష్ రావు తొలిసారి పోటీ చేసి గెలిచారు. ఇక మధ్యలో ఒక ఉప ఎన్నికతో పాటు 2009, 2014, 2018, 2023లలో ఆయన వరసగా గెలిచారు. ఈ విధంగా చూసుకుంటే మామకు సరిసాటిగా మేనల్లుడు హరీష్ రావు కూడా ఆరు సార్లు గెలిచి సత్తా చాటారు అన్న మాట. 1985 నుంచి 2028 దాకా లెక్కిస్తే ఏకంగా 43 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబం ఆధీనంలోనే సిద్ధిపేట ఉండిపోయింది. అక్కడ ఆ ఫ్యామిలీకి తిరుగులేదని అనేక సార్లు నిరూపితం అయింది. ఒక విధంగా కంచుకోటగా ఉంది.

రేవంత్ రీసౌండ్ :

అలాంటి సిద్ధిపేటలో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తాజాగా పర్యటించి పొలిటికల్ గా రీ సౌండ్ చేశారు అని అంటున్నారు. సిద్ధిపేటలో కాంగ్రెస్ ని గెలిపించి చూపిస్తామని ఆయన గట్టిగానే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతే కాదు సిద్దిపేట నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తామని ఆయన ప్రకటించారు. దీని అర్థం ఎటూ తెలంగాణాలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుంది కాబట్టి మంత్రి పదవిని ముందే ఆఫర్ చేసి మరీ కాంగ్రెస్ ని గెలిపించాలని జనాలను రేవంత్ కోరారు అన్న మాట.

మదన్ మోహన్ ని తలచుకుని :

ఇదిల ఉంటే ఈ తరానికి తెలియదు కానీ 1983లో టీడీపీ నుంచి పోటీ చేసిన కేసీఆర్‌ను ఓడించిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అనంతుల మదన్ మోహన్ అని గట్టి నాయకుడు అక్కడ ఉండేవారు. ఆయన తరువాత మళ్లీ కాంగ్రెస్ జెండా సిద్ధిపేటలో ఎగరలేదు. దాంతో రేవంత్ రెడ్డి అంతా మరచిన మదన్ మోహన్ ని సిద్ధిపేట సభలో తలచుకున్నారు. మదన్ మోహన్ పేరును సిద్దిపేట మెడికల్ కాలేజీకి పెట్టాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఆదేశాలు ఇస్తున్నట్లుగా ముఖ్యమంత్రి అక్కడికక్కడే ప్రకటించారు. అంతే కాదు సిద్ధిపేట కాంగ్రెస్ కి బలమైన స్థావరం అని అన్నారు. సీఎం సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనాలను చూసిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ని గట్టిగానే టార్గెట్ చేశారు. కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లక్ష్యంగా ఆయన పదునైన విమర్శలు గుప్పించారు.

జనాలు ఆలోచించేలా :

ఎంతకాలం ఒకే కుటుంబం ఒకే రాజకీయం అంటూ జనాలలో ఆలోచనలు తట్టిలేపేలా రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ గానే స్పీచ్ ఇచ్చారు. అదే సమయంలో వారసత్వ రాజకీయాలు అంటూ బీఆర్ఎస్ ని గట్టిగా టార్గెట్ చేశారు. మామ కాకపోతే అల్లుడు వస్తారు ఎంత కాలం వారేనా అని ప్రశ్నించారు. అంతే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు, ఫామ్ హౌస్‌లు, ఆస్తుల వ్యవహారాలపై బీఆర్ఎస్ కి ప్రశ్నలు వరసగా సంధించారు. ఒక విధంగా బీఆర్ఎస్ కంచుకోటనే టార్గెట్ చేయడం ద్వారా కుంభ స్థలానికే రేవంత్ రెడ్డి గురి పెట్టారు అని అంటున్నారు. సిద్ధిపేట ఒక అసెంబ్లీ సీటు మాత్రమే కాదు, కేసీఆర్ రాజకీయ ప్రస్థానానికి తొలి అడుగు, ఆయన టీఆర్ఎస్ స్థాపించినపుడు టీడీపీకి రాజీనామా చేసి ఒక్కడిగా బయటకు వచ్చినపుడు ఉప ఎన్నికల్లో గెలిపించి అండగా నిలిచింది. అంతే కాదు ప్రభుత్వాలను సవాల్ చేసి ఉప ఎన్నికలు తెచ్చినప్పుడల్లా గులాబీ జెండాను పట్టింది. వైఎస్సార్ హయాంలో కూడా సిద్ధిపేట బీఆర్ఎస్ దే అయింది. మరి అలాంటి కంచుకోటను రేవంత్ రెడ్డి ఇపుడు టార్గెట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ కి భారీ సవాల్ నే విసిరారు అంటున్నారు.

Tags:    
  • revanthreddy 
  • kcr 
  • harishrao 
  • siddipet 

Similar News

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

Copyright @2026

Powered by Blink CMS