• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Devotional >  కార్తీక మాసంలో శాకాహారమే...

కార్తీక మాసంలో శాకాహారమే ఎందుకు తినాలి?

| కార్తీక మాసం ప్రారంభం కావడంతో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో శాకాహారం తీసుకోవడం, దీపారాధన, పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. సాత్విక ఆహారంతో మనసు ప్రశాంతంగా ఉంటుందని, జీవహింసకు దూరంగా ఉండి నియమ నిష్ఠలు పాటించాలనేది ఈ ఆచారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ఉద్దేశమని పెద్దలు చెబుతారు.

By - Madhu Reddy
Update: 2026-11-10 06:42 GMT

హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక శోభతో కళకళలాడే కార్తీక మాసం ఈరోజు నుంచే ప్రారంభమైంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో భక్తులు తెల్లవారుజామునే లేచి దీపారాధనలు చేస్తూ పూజల్లో నిమగ్నమవుతారు. అయితే ఈ నెల వచ్చిందంటే చాలు, చాలామంది ఇళ్లలో నాన్‌వెజ్‌కు ఫుల్ స్టాప్ పెట్టి ప్యూర్‌ వెజిటారియన్‌గా మారిపోతారు. అసలు కార్తీక మాసంలో శాకాహారమే ఎందుకు తినాలి? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శివకేశవులకు ప్రీతికరమైన పవిత్ర మాసం:

కార్తీక మాసాన్ని పరమశివుడు, శ్రీమహావిష్ణువు ఇద్దరికీ అత్యంత ఇష్టమైన మాసంగా భావిస్తారు. ఈ నెలంతా రోజూ ఉదయాన్నే స్నానాలు ఆచరించి, గుళ్లకు వెళ్లి దీపాలు వెలిగిస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక మనసును చెడు ఆలోచనల నుంచి దేవుడి వైపు మళ్లించడానికి ఈ మాసం సరైన సమయం. అందుకే ఎలాంటి భోగభాగ్యాలకు పోకుండా, నిష్టగా ఉంటూ భగవంతుడిని ఆరాధించాలని పెద్దలు చెబుతుంటారు.

పురాణాలు ఏం చెబుతున్నాయి? :

కార్తీక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలని మన పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. ముఖ్యంగా స్కంద పురాణంలోని కార్తీక మాస మహాత్మ్యంలో ఈ నెలలో మాంసం, మద్యపానానికి పూర్తిగా స్వస్తి చెప్పాలని సూచించారు. వ్రతాలు ఆచరించే వాళ్లే కాకుండా, సాధారణ భక్తులు కూడా ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత, సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పెద్దల విశ్వాసం.

సాత్విక ఆహారంతోనే మనసు ప్రశాంతం:

మనం తినే ఆహారమే మన ఆలోచనలను డిసైడ్ చేస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటారు. మాంసాహారాన్ని తామసిక ఆహారంగా చూస్తారు, ఇది మనసులో చికాకును, కోపాన్ని పెంచుతుంది. అదే పండ్లు, కూరగాయలు, పాలు లాంటి సాత్విక ఆహారం తీసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక పూజలు, ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత కుదరాలంటే సాత్విక భోజనమే బెస్ట్ ఆప్షన్.

జీవహింసకు దూరం.. కరుణే ప్రధానం :

ఈ ఆచారం వెనుక కేవలం ఆరోగ్యం, ఆధ్యాత్మికతే కాకుండా మూగజీవాల పట్ల దయ చూపించాలనే మంచి ఉద్దేశం కూడా ఉంది. సృష్టిలోని ప్రతి ప్రాణిని ప్రేమించాలని హిందూ ధర్మం బోధిస్తుంది. ఇక కార్తీక మాసంలో జీవహింసకు దూరంగా ఉంటూ, పకృతితో మమేకమై జీవించడమే ఈ సంప్రదాయం తాలూ అసలు సారాంశం.

మొత్తానికి కార్తీక మాసం అనేది కేవలం పూజలు చేసే నెల మాత్రమే కాదు, మన శరీరానికి, మనసుకు ఒక ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లాంటిది. ఈ ఒక్క నెల శాకాహారం తింటూ, ఇంద్రియ నిగ్రహంతో ఉంటే ఎంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. అందుకే ఈ కార్తీక మాసంలో మీరు కూడా నియమ నిష్టలతో ఉండి ఆ దేవుడి కృపను పొందండి.

Tags:    
  • kartikamasam 
  • kartikamasam2026 
  • hindutraditions 
  • satvikfood 
  • spirituality 

Similar News

పూరీ గోపురంపై పవిత్ర జెండా...ప్రతీ రోజూ సాహసమే !

2026-10-30 03:28 GMT

Copyright @2026

Powered by Blink CMS