• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Overseas >  అమెరికాలో ఎస్‌బీఐ...

అమెరికాలో ఎస్‌బీఐ విస్తరణ.. టెక్సాస్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభం!

| అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కోలో ఎస్‌బీఐ కొత్త బ్యాంకు శాఖను ప్రారంభించింది. ఎస్‌బీఐ కాలిఫోర్నియా అనుబంధ సంస్థ రాష్ట్రం వెలుపల ఏర్పాటు చేసిన తొలి బ్రాంచ్ ఇదే. వ్యక్తిగత, వ్యాపార ఖాతాలు, రుణాలు, అంతర్జాతీయ నగదు బదిలీ సేవలను ఈ శాఖ అందించనుంది. దీంతో అమెరికాలో ఎస్‌బీఐ శాఖల సంఖ్య ఎనిమిదికి చేరింది.

By - Tupaki Desk
Update: 2026-11-10 07:15 GMT

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. టెక్సాస్‌లోని ఫ్రిస్కో నగరంలో కొత్త బ్యాంకు శాఖను ప్రారంభించింది. అమెరికాలో ఎస్‌బీఐ కాలిఫోర్నియా అనుబంధ సంస్థ రాష్ట్రం వెలుపల ఏర్పాటు చేసిన తొలి బ్రాంచ్ ఇదే కావడం విశేషం.

డల్లాస్‌కు సమీపంలోని ఫ్రిస్కో ప్రస్తుతం ఐటీ నిపుణులు, భారతీయ ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ప్రధాన నివాస ప్రాంతంగా మారుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా పెరుగుతున్న బ్యాంకింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

బ్రాంచ్ ప్రారంభోత్సవంలో ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి, భారత కాన్సుల్ జనరల్ మంజునాథ్, ఫ్రిస్కో మేయర్ మార్క్ హిల్ పాల్గొన్నారు. వ్యక్తిగత డిపాజిట్లు, వ్యాపార ఖాతాలు, వాణిజ్య రుణాలు, అంతర్జాతీయ నగదు బదిలీ వంటి సేవలను ఈ శాఖ అందించనుంది.

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు భారత్‌కు డబ్బు పంపడం, పొదుపు ఖాతాలను నిర్వహించడం మరింత సులభం కానుంది. అలాగే స్థానికంగా వ్యాపారాలు నిర్వహించే భారతీయ సంస్థలకు కూడా ఈ బ్రాంచ్ ఉపయోగపడుతుంది.

ఈ ప్రారంభంతో ఎస్‌బీఐ కాలిఫోర్నియా అనుబంధ సంస్థకు చెందిన అమెరికా శాఖల సంఖ్య ఎనిమిదికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో 245 విదేశీ కార్యకలాపాల కేంద్రాలను నిర్వహిస్తున్న ఎస్‌బీఐ.. అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది.

Tags:    
  • sbi 
  • statebankofindia 
  • frisco 
  • texas 
  • indianamericans 

Similar News

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా.. ‘షాల్ వుయ్ మూవ్?’ అన్న మోదీ!

2026-11-18 06:50 GMT

మొన్న మైక్రోసాఫ్ట్.. నేడు అమెరికా బ్యాంకులు.. అగ్రరాజ్యంలో అసలేం జరుగుతోంది?

2026-11-17 10:30 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ తెచ్చిన కొత్త రూల్‌ను కొట్టేసిన కోర్టు!

2026-11-17 10:20 GMT

డర్టీ బాంబ్‌.. పేలుడు కంటే రేడియేషన్‌తోనే ఎక్కువ ముప్పు!

2026-11-17 10:01 GMT

రోడ్లపై 'ఎర్ర' సముద్రం.. ఇదీ ప్రకృతి సృష్టిస్తున్న అద్భుత దృశ్యం

2026-11-17 05:35 GMT

అమెరికాలో ఇరాన్ దాడికి ప్లాన్ చేస్తోందా? ట్రంప్ అధికారులకు భద్రత పెంపు!

2026-11-17 05:35 GMT

ఆస్ట్రేలియాలో చదువుతున్న వారికి కొత్త తలనొప్పి.. కుటుంబ సభ్యుల వీసాపై మారిన రూల్స్!

2026-11-17 04:41 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది.. మాస్టర్స్ చదువుపైనే ఎక్కువ ప్రభావం!

2026-11-17 04:38 GMT

ఇంట్లో తినడానికి గుప్పెడు పిండి లేదు.. కానీ భారత్‌ను కొట్టడానికి టర్కీ నుంచి ఏకంగా లక్ష డ్రోన్లట..

2026-11-16 07:57 GMT

భారత ఐటీ కంపెనీలకు అమెరికాలో కొత్త చిక్కులు.. H-1B వీసాలపై పెరుగుతున్న ఆంక్షలు!

2026-11-16 04:28 GMT

ఆర్థిక ఇబ్బందులతో ఇరాన్ ప్రజల కఠిన నిర్ణయాలు.. అవయవాల విక్రయానికి ప్రకటనలు!

2026-11-16 04:26 GMT

Copyright @2026

Powered by Blink CMS