జనసేన ఎమ్మెల్యేకు మామూలుగా లేదు ట్రోలింగ్ !
| రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మి సీతానగరం జెడ్పీటీసీ స్థానంలో ఓటమి పాలయ్యారు. వైసీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు 2,607 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గంలో వైసీపీ సాధించిన విజయాలతో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వర్గం సంబరాలు చేసుకుంటుండగా, బత్తులపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు అందరికీ ఎలా ఉన్నా కానీ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు మాత్రం చుక్కలు చూపించాయి. ఏకంగా ఆయన సతీమణి బత్తుల వెంకటలక్ష్మి సీతానగరం జెడ్పీటీసీ స్థానంలో ఓటమి పాలు కావడం అయితే ఎమ్మెల్యే వర్గం జీర్ణించుకోలేని తీరుగానే ఉంది అని అంటున్నారు. పైగా రాజానగరం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం చలాయించింది. ఈ నేపథ్యంలో బత్తుల బలరామక్రిష్ణకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే మామూలుగా లేదని అంటున్నారు.
పులివెందుల దాకా ఎందుకు :
ఇక రాజానగరం ఎమ్మెల్యే బత్తుల గతంలో చానళ్ళలో మాట్లాడుతూ జగన్ ని పులివెందులలో ఓడిస్తామని హాట్ కామెంట్స్ చేశారు. ఇపుడు దానికి రివర్స్ లో వైసీపీ అభిమానులు ఎటాక్ ఇస్తున్నారు. పులివెందుల దాకా ఎందుకు బాబాయ్ అంటూ చేస్తున్న కామెంట్స్ తో బత్తుల వర్గం కక్కలేక మింగలేక అన్నట్లుగా సీన్ ఉందని అంటున్నారు. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి అన్నట్లుగా ఉంది బత్తుల బలరామకృష్ణ తీరు అని కూడా వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. సొంత నియోజకవర్గంలో భార్యను గెలిపించుకోలేక పోయారు అని సెటైర్లు వేస్తున్నారు.
జక్కంపూడి అంటే బ్రాండ్ :
పులి నోట్లో తల పెట్టాలనుకుంటే పులివెందుల దాకా ఎందుకు ఇక్కడ చాలు అని కూడా అంటున్నారు. జక్కంపూడి అంటేనే ఒక పులి అని ఆయన అభిమానులు చెబుతూ బత్తుల వర్గాన్ని హీటెక్కిస్తున్నారు. జక్కంపూడి అంటే ఒక బ్రాండ్. ముందు ఆయన్ని ఎదుర్కో బాబాయ్ అంటూ బత్తులకు సవాల్ చేస్తున్నారు. సీతానగరంలో ఎంపీటీసీ ఎన్నికల్లో 21 కి 18 ఎంపీటీసీలు కోరుకొండలో 23 ఎంపీటీసీలకు 12 ఎగరేసాడు మా జక్కంపూడి అని అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
కోడితే రీ సౌండే మరి :
రాజానగరంలో వైసీపీ విజయాలను క్యాడర్ ఎంతలా ఆస్వాదిస్తోందో సోషల్ మీడియా పోస్టులు చెబుతున్నాయి. కొడితే రీసౌండ్ వచ్చింది అంటూ ప్రత్యర్థి వర్గాన్ని బాగానే టీజింగ్ చేస్తున్నారు. ఇంతకీ రాజానగరంలో రాజకీయం స్థానిక ఎన్నికల్లో ఎలా మారింది అన్నది చూస్తే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి ఓటమి పాలవడం ప్రకంపనలే సృష్టించింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరి బాబు ఆమెపై 2,607 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.
బత్తులకు బిగ్ షాక్ :
ఏపీ వ్యాప్తంగా చూస్తే కూటమి ప్రభంజనం కొనసాగుతూంటే రాజానగరం లో మాత్రం సీన్ రివర్స్ అయిది. ఏకంగా ఎమ్మెల్యే సతీమణి ఓటమి చెందడం పెద్ద చర్చగానే ఉంది. అలాగే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వైసీపీ శ్రేణులను మొత్తంగా కో ఆర్డినేట్ చేసిన తీరుతోనే ఈ విజయాలు దక్కాయని అంటున్నారు. ఇక ఎమ్మెల్యే పనితీరు మీద విమర్శలు ఉన్నాయని అంటున్నారు.జనసేన అలెర్ట్ కావాల్సి ఉందని ఈ ఫలితాలు చెబుతున్నాయని విశ్లేషిస్తున్నారు