తుని.. య‌న‌మ‌ల దివ్య‌కు పొలిటిక‌ల్ గ‌ని ..!

రాజకీయాల్లో వారసత్వాలకు కొదవలేదు. అది పురుషులైనా మహిళలైనా ఇటీవల కాలంలో రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ పొలిటికల్ కెరీర్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.;

Update: 2026-04-28 12:30 GMT

రాజకీయాల్లో వారసత్వాలకు కొదవలేదు. అది పురుషులైనా మహిళలైనా ఇటీవల కాలంలో రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ పొలిటికల్ కెరీర్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వారిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం ఎమ్మెల్యే కీలకమని చెప్పాలి. గత ఎన్నికల్లో తుని నియోజకవర్గ నుంచి మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ నాయకుడు యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య పోటీ చేశారు.. విజయం కూడా దక్కించుకున్నారు. నిజానికి వైసీపీ ఇక్కడ బలంగా ఉంది.

స్థానికంగా కూడా వివాదరహితంగా వైసిపి గత ఎన్నికల సమయంలో వ్యవహరించింది. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ తునిలో వైసీపీ విజయం సాధిస్తుందని చాలామంది అంచనా వేశారు. కానీ దీనికి భిన్నంగా తుని పొలిటిక‌ల్ తెర‌పై తొలిసారి యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య విజయం సాధించారు. పైగా ఆ సమయంలో సొంత కుటుంబంలోనే రెండు వర్గాలుగా ఏర్పడిన పరిస్థితి ఉంది, యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. టిడిపి ఓటు బ్యాంకు చీల్చే ప్రయత్నం చేశారని పెద్ద ఎత్తున చర్చ కూడా సాగింది.

అయినా కూడా.. యనమల దివ్య ఘన విజయం దక్కించుకున్నారు. నియోజకవర్గంలో ప్రజల అభిమానాన్ని చూర‌గొన్నారు. ఇప్పుడు రెండు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మరి ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది.. నియోజకవర్గం అభివృద్ధి.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల తీరు ప్రజలకు అందుతున్న లబ్ధి వంటివి ఏ మేరకు దివ్యకు పేరు తీసుకు వస్తున్నాయి.. అనేది చూస్తే సానుకూల పరిణామాలే కనిపిస్తున్నాయని స్థానిక రాజకీయ నాయకులు చెబుతున్నారు.

గత ఎన్నికల వరకు యనమల రామకృష్ణుడి పేరుతోనూ యనమల కుటుంబం పేరుతో రాజకీయాలు చేసిన దివ్య ఇప్పుడు సొంతంగానే తన ఇమేజ్‌ను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి తోడు వైసిపి తరఫున కార్యక్రమాలు చేసేందుకు పెద్దగా ఆసక్తి కనిపించని పరిస్థితి ఉంది. ఇది దివ్యకు మరింతగా కలిసి వచ్చింది. వ్యక్తిగతంగా ఉన్నత విద్యావంతురాలు అయిన దివ్య సమస్యలను పరిష్కరించే విషయంలోనూ అధికారులను ముందుకు నడిపించే విషయంలోనూ చాలా విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు.

వివాద రహితంగా ప్రజలకు చేరువగా . ఆమె వేస్తున్న అడుగులు మంచి ఫలితాన్ని అందిస్తున్నాయి. ఎక్కడ ఎమ్మెల్యే పై వ్యతిరేకత కనిపించడం లేదు. సొంత పార్టీలోనూ కలివిడితనం స్పష్టంగా ఉంది. అయితే క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కలుపుకుని వెళ్లే విషయంలో ఎమ్మెల్యే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించాలి. నియోజకవర్గంలో అభివృద్ధి విషయాన్ని పరిశీలిస్తున్నప్పటికీ వ్యక్తిగత అంశాల విషయంలో కార్యకర్తల నుంచి వస్తున్న విజ్ఞాపనలను కూడా ఆమె పరిశీలనలోకి తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో వరుసగా విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబుకు అందిన ఎమ్మెల్యేల రిపోర్టులో దివ్య తొలి 100 స్థానాల్లోనే ఉండడం విశేషం.

Tags:    

Similar News