తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిపై థింకింగ్ మారుతోందన్న సర్వే
కాలం మారింది. అందుకు తగ్గట్లే అభిప్రాయాలు.. అభిరుచులు మారుతున్నాయి. గతానికి భిన్నంగా పెళ్లి కాని ప్రసాదులే కానీ.. పెళ్లి కాని అమ్మాయిల ఆలోచనల్లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ప్రముఖ పెళ్లి సంబంధాల వేదిక తెలుగు మ్యాట్రిమోని నిర్వహించిన సర్వే నివేదికలో వెల్లడైంది. లైఫ్ పార్టనర్ ను ఎంపిక చేసుకోవటంలో ఎలాంటి అంశాలు కీలకం కానున్నాయన్న విషయాన్ని ఈ సర్వే వెల్లడించింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గతానికి భిన్నంగా కులాంతర వివాహాలకు అబ్బాయిలే కాదు అమ్మాయిలు సైతం మొగ్గు చూపుతున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తమ వద్ద రిజిస్టర్ చేసుకునే అబ్బాయిల్లో 45 శాతం మంది ఐటీలో పని చేస్తున్న జీవితభాగస్వామిని కోరుకున్నట్లుగా పేర్కొన్నారు. అదే సమయంలో 43 శాతం అమ్మాయిలు.. తాము పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయిలు ఐటీ రంగానికి చెందిన వారు అయి ఉండాలని భావిస్తున్నారు. ఐటీ ఉద్యోగులతో పాటు టీచర్లు.. డాక్టర్లు తమ పార్టనర్ గా వస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
మంచి చదువు.. సంపాదన ఉండాలే కానీ.. ఇరు వర్గాల నుంచి కులం పెద్ద విషయం కాదన్న కొత్త మాట.. తమ అధ్యయనంలో వెల్లడైందని పేర్కొన్నారు. నివేదికలో పేర్కొన్న ప్రకారం 16.4 శాతం మంది మహిళలు వేరే కులానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి తమకు అభ్యంతరం లేదని చెప్పగా.. 24.3 శాతం అబ్బాయిలు ఇదే విషయాన్ని వెల్లడించారన్నారు. పదేళ్ల క్రితం కులాంతర వివాహం విషయంలో ఒకరిద్దరు తప్పించి.. ఎవరూ ఆసక్తిని చూపే వారు కాదని.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి ఉందన్నారు.
పెళ్లి చేసుకునే వారిలో 74 శాతం మంది 23 నుంచి 32 సంవత్సరాల మధ్యన ఉన్నారని పేర్కొన్నారు. వివాహ వయసు విషయంలో అబ్బాయిలు.. అమ్మాయిలు ఇంచుమించు ఒకే వయసుకు చెందిన వారు ఉండగం విశేషం. ఏమైనా.. జీవితంలో స్థిరపడిన వారు.. చక్కటి ఆదాయాన్ని వస్తున్న వారిని పెళ్లి చేసుకోవటానికి ఆసక్తిని చూపిస్తున్నారన్న విషయాన్ని తాజా సర్వే వెల్లడించింది.