సుప్రీం కీలక తీర్పు: రేప్ కేసులో ముందస్తు బెయిల్ ఓకే

Update: 2020-02-10 10:00 GMT
ప్రాథమిక విచారణ పూర్తయి నేరం నిరూపితం కాకుంటే ముందస్తు బెయిల్ పొందవచ్చని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ - ఎస్టీ సవరణ చట్టం 2018 రాజ్యాంగబద్ధతను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం సమర్థిస్తూ ఈ మేరకు పలు కీలక ఆదేశాలు ఇచ్చింది. అత్యాచారం కేసుల్లో ప్రధాన నిందితులకు ప్రత్యేక పరిస్థితుల్లో ముందస్తు బెయిల్‌ను న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేయవచ్చని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ చట్టం ప్రకారం ఎఫ్ ఐఆర్ నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ - పోలీస్ ఉన్నతాధికారుల అనుమతి అవసరం లేదని వెల్లడించింది. తోటి పౌరులను సమానంగా చూసుకోవాలని - సోదర భావనను పెంచుకోవాలని ధర్మాసనంలోని మరో సభ్యుడు జస్టిస్ రవీందర్ భట్ సూచించారు.ఎస్సీ - ఎస్టీ చట్టం ప్రకారం ప్రధాని నిందితుడిపై కేసును చేయకుండా - ముందస్తు బెయిల్‌ విషయంలో పార్లమెంటు ఉద్దేశాన్ని తప్పుదారి పట్టించేలా ఉంటే ఎఫ్‌ ఐఆర్‌ ను కోర్టు రద్దు చేయవచ్చని జస్టిస్ భట్ వ్యాఖ్యానించారు.

ఎస్సీ - ఎస్టీ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని - ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్నారని.. ఈ చట్టం కింద కేసు నమోదు చేయగానే వెంటనే అరెస్టులు చేయకూడదని - పోలీసులు విచారించాలని - ముందస్తు బెయిలు కూడా ఇవ్వాలని 2018 మార్చి 20న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై అప్పట్లో దళిత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. భారీగా నిరసనలు - ఆందోళనలు రావడంతో ఎస్సీ - ఎస్టీ సవరణ చట్టం 2018 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ పలు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

వాటిపై విచారణ చేసి సోమవారం తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ఎస్సీ - ఎస్టీ సవరణ చట్టం 2018 సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లను కొట్టేసింది. ఈ చట్టం యధాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Tags:    

Similar News