విజయ్ రాహుల్ ని ప్రధానిగా చేస్తారా ?

రాహుల్ గాంధీ రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు ఇప్పటి అయిదు సార్లు ఎంపీగా గెలిచారు.;

Update: 2026-05-09 17:46 GMT

రాహుల్ గాంధీ రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు ఇప్పటి అయిదు సార్లు ఎంపీగా గెలిచారు. 2024 నుంచి లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ ర్యాంక్ హోదాతో తొలిసారి అధికారిక హంగులను అనుభవిస్తున్నారు. గాంధీల వంశంలో అయిదవ తరానికి చెందిన రాహుల్ గాంధీ ఏనాడో ప్రధాని అయిపోవాలి. కానీ ఆయన ఈ రోజుకీ పోరాటం చేస్తూనే ఉన్నారు. 2029 ఎన్నికల మీద కాంగ్రెస్ కి చాలా ఆశలు ఉన్నాయి. మరీ ముఖ్యమంగా దక్షిణాదిన కాంగ్రెస్ ఈ రోజున చూస్తే బలంగా ఉన్నట్లుగానే లెక్క. కేవలం ఏపీ తప్ప కాంగ్రెస్ కి ఇపుడు అంతటా అనుకూలమైన పరిస్థితి ఉంది.

నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ :

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేరళంలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది అనూహ్యంగా తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో కూడా చేరబోతోంది. కర్ణాటక, తెలంగాణాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. లేనిదల్లా ఏపీలోనే. ఇక కాంగ్రెస్ కి అన్నింటికన్నా ఇపుడు ప్రత్యేక ఆకర్షణగా కొత్త మిత్రుడు టీవీకే అధినేత విజయ్ కనిపిస్తున్నారు. స్వతహాగా సినీ సూపర్ స్టార్ అయిన విజయ్ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలలో ఉంది. అదే విధంగా ఆయన రాజకీయ సిద్ధాంతాలు కూడా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దాంతో సామాజిక సమీకరణలను మిగిలిన చోట్ల కూడా విజయ్ అండతో మార్చుకోగలమన్న విశ్వాసం కాంగ్రెస్ పెద్దలలో కనిపిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి రావాలని స్వతహాగా నిర్ణయించుకున్నా అది కాంగ్రెస్ కి దక్షిణాదిన పెద్ద అండగా మారబోతోంది అని అంటున్నారు.

ఫ్యూచర్ పీఎం విత్ సీఎం :

ఈ మాట అంటోంది టీవీకే కార్యకర్తలు. రాహుల్ గాంధీతో విజయ్ ఉన్న ఫోటోలను పెట్టి వారు పండుగ చేసుకుంటున్నారు. దేశానికి రాహుల్ గాంధీని ప్రధానిగా అపుడే టీవీకే క్యాడర్ అంటోంది. ఇక విజయ్ అయితే కాంగ్రెస్ భావజాలాన్ని ఇష్టపడతారు అని గతంలోనే చెప్పుకున్నారు. ఎన్నికల ముందే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరాల్సి ఉంది. కానీ అది జరగలేదు. ఏది ఏమైనా కాంగ్రెస్ కి ఇపుడు వరంగా విజయ్ మారారు. తనకు ఉన్న పంచ పాండవుల్లాంటి అయిదురుగు ఎమ్మెల్యేల మద్దతు విజయ్ ని ప్రాణ వాయువు అయింది. దాంతో విజయ్ కూడా కాంగ్రెస్ ని దేశంలో అధికారంలోకి తెచ్చేందుకు సరైన సమయంలో తన వంతుగా కృషి చేస్తారు అని అంటున్నారు.

యంగ్ స్టార్స్ తో ముందుకు :

రేపటి రోజున తెలుగు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ ని గెలిపించేందుకు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు సీఎం విజయ్ కాంగ్రెస్ కి బాగా ఉపయోగపడతారు అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో తమిళనాడులో కాంగ్రెస్ మొత్తం 39 ఎంపీ సీట్లలో సగానికి సగం అయినా పోటీ చేయవచ్చు. అలా కాంగ్రెస్ కి విజయ్ పార్టీ కూడా సహకరించేందుకు వీలు ఉంది అని అంటున్నారు. అలాగే ఏపీలో దాదాపుగా కోల్డ్ స్టోరేజిలో పడిపోయిన కాంగ్రెస్ కి విజయ్ వంటి సినీ గ్లామర్ ఉన్న సీఎం దళిత వాదం నమ్మిన నాయకుడు తోడు ఉంటే అక్కడ కూడా పార్టీ పునరుజ్జీవం అయ్యే చాన్స్ కనిపించవచ్చు అని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు విజయ్ వంటి వారి సాయం కాంగ్రెస్ కచ్చితంగా తీసుకుంటుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే రాహుల్ గాంధీకి సరైన సమయానికి కొత్త మిత్రుడుగా విజయ్ కలిసి వస్తున్నారు అని అంటున్నారు. మరి తమిళనాడుకు విజయ్ సీఎం అయిపోయారు. దేశానికి రాహుల్ పీఎం అవుతారా, ఆ విధంగా కొత్త మిత్రుడు విజయ్ చేయాల్సింది చేస్తారా అంటే రాజకీయ వెండి తెర మీద చూడాల్సిందే.

Tags:    

Similar News