సీఎం.విజయ్ ..గండాల దారిలో దళపతి !

ఎట్టకేలకు తమిళనాడులో టీవీకే ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఇళయ దళపతిగా వెండితెరను ఏలిన విజయ్ ఇపుడు సీఎం విజయ్ కాబోతున్నారు.;

Update: 2026-05-09 17:46 GMT

ఎట్టకేలకు తమిళనాడులో టీవీకే ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఇళయ దళపతిగా వెండితెరను ఏలిన విజయ్ ఇపుడు సీఎం విజయ్ కాబోతున్నారు. ఆయన కోరిక అభిమానుల ఆశలు అన్నీ నెరవేరే రోజు మే 10. ఇది తమిళనాడు చరిత్రలో శానా కాలం యాది ఉంటాది. అయితే విజయ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత సరిగ్గా వారం రోజుల అనంతరం అధికారం అందుకోబోతున్నారు. కేవలం పది సీట్ల కోసం వారం రోజులు విజయ్ ఎదురు చూడాల్సి వచ్చింది. ఇక చిన్న పార్టీల మద్దతు విజయ్ దక్కడం వెనక పెద్ద కసరత్తే సాగింది. దాంతో విజయ్ కి రియల్ సినిమా కష్టాలేంటో పూర్తిగా అర్థం అయ్యాయి.

దిన దిన గండమేనా :

అయితే ఇళ్ళు అలకాగానే పండుగ అయిపోదు అని అంటారు. విజయ్ కొత్త ముఖ్యమంత్రిగా తమిళనాడుకు అవడం వరకూ ఓకే కానీ ఆయన పాలన తీరు ఎలా ఉంటుందో చూడాలి ఉంది. ప్రతీ ఏటా 87 వేల కోట్ల దాకా టీవీకే పార్టీ ఇచ్చిన ఉచిత హామీలను నెరవేర్చడానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేంద్రానికి అక్కడ బీజేపీ ఆధ్వర్యంలో నడుపుతున్న ఎన్డీయే ప్రభుత్వానికి యాంటీగా విజయ్ కొత్త రాజకీయ వేదికను తమిళనాడులో ఏర్పాటు చేశారు. ఇది ఆయన పొలిటికల్ ఫిలాసఫీగా ఉంది. అందులో ఏ మాత్రం విజయ్ రాజీ పడలేదు. అందుకు గానూ ఆయన్ని అభినందించాలి. కానీ రాజకీయాలకు సిద్ధాంతాలకు మధ్యనే అసలైన సంఘర్షణ ఉంటుంది. అదిని విజయ్ ఎలా ఎదుర్కొంటారు అన్నదే చూడాల్సి ఉంది.

అరకొర మెజారిటీతోనే :

ఇక విజయ్ ప్రభుత్వానికి అరకొర మెజారిటీయే ఉంది. 120 మందితో ఆయన ప్రమాణం చేస్తున్నారు. దానితో పాటు రేపటి రోజున ద్రవిడ పార్టీల నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వంలో చేరవచ్చు. అలా మెజారిటీ పెరగవచ్చు. అలా వచ్చిన వారి నుంచి కూడా సమస్యలు కూడా వస్తాయి. మరో వైపు స్టాలిన్ యాభై ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన వారు. ఆయనను విపక్షంలో ఎదుర్కోవడం కష్టం. ఆయన ఇప్పటికే తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని కోరుతున్నారు. అలాగే మరో మాజీ సీఎం పళనిస్వామి కూడా వ్యూహాలలో దిట్ట. ఆయన ఈ దఫా ఎలాగైనా సీఎం కావాలని చూస్తున్నారు. దానికి టీవీకే ఏ మాత్రం చాన్స్ ఇచ్చినా ఆయన అల్లుకుని పోతారని అంటున్నారు.

విజయ్ ఏమిటన్నది :

ఇప్పటిదాకా విజయ్ ఏమిటన్నది జనాలకు కానీ రాజకీయ జనాలకు కానీ పెద్దగా తెలిసింది లేదని అంటున్నారు. ఆయన ఎన్నికల్లో కూడా తక్కువ సభలలోనే ప్రసంగించారు. ఎక్కువ ఆయన బొమ్మలతో ప్రచారం చేశారు. వాస్తవంగా ఆయన తక్కువ మాట్లాడుతారు అని అంటారు. అందులో వ్యూహాలు ఉండొచ్చు. రాజకీయాల్లో అధికంగా మాట్లాడడం ఇబ్బంది కరమే అయితే మరీ తక్కువగా మాట్లాడడం కూడా ప్రమాదమే అంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి మాట్లాడాల్సిన సందర్భాల్లో మౌనంగా ఉంటే ఎలాంటి రాంగ్ డైరెక్షన్స్ వెళ్తాయన్నది అందరికీ తెలిసిందే. ఇక ఆయనకు రాజకీయాలు కొత్త ప్రభుత్వం నడపడమూ కొత్త పాలన కొత్త. ఇవన్నీ ఆయన నెమ్మదిగా నేర్చుకోవాల్సి ఉంది. దానికి పార్టీలో కానీ కూటమిలో మిత్రులు కానీ ఇబ్బంది పెట్టకుండా సహకరించాల్సి ఉంది.

నాయకుడిగానే నెగ్గాలి :

విజయ్ ఇప్పటిదాకా తన సినీ గ్లామర్ ని కొత్త తరం లీడర్ షిప్ ని జనం ముందు పెట్టి నెగ్గారు. ఇక మీదట ఆయన నెగ్గాల్సింది పరిపాలనలో. నాయకుడిగా ప్రభుత్వ సారధిగా ఆయన మంచి మార్కులు వేసుకోవాలి. ఆయన మిత్ర పక్షాలతో ఎలా ఉంటారు, ప్రతిపక్షాల పట్ల ఆయన విధానాలు ఎలా ఉంటాయి, సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల ఆయన ఏ తీరుగా వ్యవహరిస్తారు అన్నది అయితే చూడాల్సి ఉంది. కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో ముఖ్యమంత్రి ప్రధానుల మధ్య ఉండాల్సిన సుహృద్భావంతో కనుక విజయ్ మెలిగితే ఆయనకు తమిళనాడుకు మేలు జరుగుతుంది. పాలనాపరంగా కూడా ఆయనకు మంచి మార్కులు పడతాయి. ఇవన్నీ కాల క్రమంలో తేలాల్సిన విషయాలు. మొత్తం మీద తమిళనాడు ప్రజలు ఎంచుకున్న కొత్త ముఖ్యమంత్రి విజయ్ కి అంతా ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Tags:    

Similar News