కేజ్రీకి సుప్రీం షాక్..ఫ్రీ మెట్రో జర్నీ కుదరదంతే!
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత - ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీలో శాంతి భద్రతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలంటూ కేంద్రంలో తనదైన శైలి పోరాటం చేసి అలసిపోయిన కేజ్రీ... త్వరలో ఢిల్లీ అసెంబ్టీకి జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసిన పథకాలకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అడ్డు చెప్పేసింది. అసలే ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ... వైరి వర్గాలు సైలెంట్ గా ఉన్నా... సుప్రీంకోర్టు కొట్టిన దెబ్బ గట్టిగానే తగలడంతో ఇప్పుడు కేజ్రీ విలవిల్లాడిపోతున్నారనే చెప్పాలి.
అసలు కేజ్రీ ప్లానేంటి? దానిని సుప్రీంకోర్టు పెట్టిన అడ్డేమిటి? అన్న వివరాల్లోకి వెళితే... ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుసగా మూడోసారి విజయదుందుభి మోగించేందుకు కేజ్రీ పక్కాగానే ప్లాన్ రచించుకున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో రైళ్లలో ప్రయాణించే మహిళలందరికీ ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించనున్నట్లుగా కేజ్రీ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేజ్రీ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. అవి కూడా ఇప్పుడు కాస్తంత సైలెంట్ గానే అయిపోయాయి. అయితే ప్రజా ప్రయోజనార్థం దాఖలైన ఓ వ్యాజ్యంపై స్పందించిన సుప్రీంకోర్టు... అసలు ఢిల్లీ మెట్రోలో ఉచిత ప్రయాణాలు ఎందుకు అంటూ ప్రశ్నించింది. మహిళలు మొత్తానికి ఉచితం అంటే ఎలా? ప్రజా ధనాన్ని సరిగా ఖర్చు పెట్టే దిశగా ఆలోచించాలని - మహిళలందరికీ ఉచిత మెట్రో ప్రయాణాలు కుదరవని తేల్చేసింది. దీంతో కేజ్రీకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి.
సివిల్ సర్వెంట్ గా ఉన్న కేజ్రీ... అన్నా హాజరే ఉద్యమం నేఫథ్యంలో తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసేసి రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చీ రాగానే ఢిల్లీలో సీఎం పీఠాన్ని దక్కించుకున్న కేజ్రీ... ఢిల్లీ శాంతిభద్రతల వ్యవహారంపై కేంద్రంతో పేచీ పెట్టుకుని తనకు తానుగానూ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిాన ఎన్నికల్లోనూ ఢిల్లీ ప్రజలు కేజ్రీకే జైకొట్టారు. దీంతో వరుసగా రెండో సారి ఢిల్లీ కి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేజ్రీ... ముచ్చటగా మూడో సారి ఆ పీఠాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉచిత పథకాలకు శ్రీకారం చుట్టారన్న విమర్శలు రేకెత్తుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం కేజ్రీకి భారీ దెబ్బగానే పరిగణించక తప్పదన్న వాదన వినిపిస్తోంది.