పవన్ కి ప్యాకేజీ గొప్పతనం అర్ధం కాలేదా?

Update: 2016-09-16 08:07 GMT
ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక హోదా ఇచ్చిన కేంద్రం మనసును ప్రజలు అర్ధం చేసుకోవడం లేదా? ఇదే సమయంలో పవన్ కల్యాన్ కి కూడా ఆ ప్రత్యేక సాయం గొప్పతనం అర్ధం కావడం లేదా? ప్రతిపక్షాల విమర్శల్లో అర్ధంలేని తనమే ఎక్కువగా ఉందా? అసలు ప్రత్యేక హోదా కంటె ప్రత్యేక ప్యాకేజీ ఎంత గొప్పదో అర్ధం కాకపోవడం వల్లే ఈ అలజడులు జరుగుతున్నాయా? అది అర్ధం కాకపోవడం వల్లే పవన్ ఆ స్థాయిలో హడావిడి చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకేమాటలో సమాధానం చెబుతున్నారు ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.

ఏపీకి ఏపీకి కేంద్ర ప్రకటించిన సాయాన్ని సీఎం చంద్రబాబు బాగా అర్ధం చేసుకున్నారని, అందుకే స్వాగతించారని చెబుతున్న వీర్రాజు.. బాబు అర్థం చేసుకున్నట్టే.. జనసేన అధినేత - సినీ నటుడు పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక సాయాన్ని అర్ధం చేసుకోవాలని చెప్పారు. ఇదే సమయంలో ఒకరోజు అటూ ఇటైనా పవన్ కూడా అర్థం చేసుకుంటారని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు అన్నారు. ఇదే సందర్భంగా అర్ధం చేసుకోకుండా చేస్తున్న పవన్ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేశారు. వీలైతే త్వరలోనే పవన్ ను కలిసి కేంద్ర అందించిన ప్రత్యేక సాయంపై వివరిస్తామని ఆయన చెబుతున్నారు.

ఇదే సమయంలో ప్రత్యేక ప్యాకేజీ గొప్పతనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే దిశగా పార్టీ ఆలోచిస్తుందని, ఇదే సందర్భంలో పియూష్ గోయల్ ఈనెల 22న రాజమండ్రిలో పర్యటించనున్నారని వీర్రాజు తెలిపారు. ఆయనతో పాటు మరికొందరు కేంద్రమంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తారని, రాష్ట్రాన్ని మరింతగా ఆదుకునే చర్యలపై పరిశీలన చేస్తారని చెబుతున్నారు.
Tags:    

Similar News