నేషనల్ పాలిటిక్స్‌లో కేసీఆర్ హవా స్టార్ట్ అవుతుందా.. కేటీఆర్ ఏమన్నారంటే!
అందుకే.. కాక్రోచ్ జనతా పార్టీ వంటివి పుట్టుకొచ్చాయని దీనిని బట్టి జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు.
బీఆర్ ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారా? త్వరలోనే ఆయన ప్రజల మధ్యకు రానున్నా రా? అంటే.. ఔననే అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. త్వరలోనే కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌లో చక్రం తిప్పుతారని చెబుతున్నారు. అంతే కాదు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ దూకుడు పెంచుతారని కూడా చెప్పుకొచ్చారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ హవా ప్రారంభం అవుతుందని వెల్లడించారు. అయితే.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కేసీఆర్ స్తబుద్దాగా ఉన్నారు కదా? అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు.
ఇక, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొన్ని రోజులు మాత్రమేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ-కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని.. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నా.. కేంద్రం నుంచి రూపాయి తీసుకురాలేక పోతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ ఏం చేసినా.. లాభం లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. ఇక, కేంద్రంలో నూ బీజేపీ సర్కారు వల్ల ఎలాంటి ప్రయోజనం లభించలేదన్నారు. అందుకే రాజకీయంగా కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారని.. నేషనల్ పాలిటిక్స్‌లో చక్రం తిప్పుతారని వ్యాఖ్యానించారు.
సీజేపీ అందుకే ..
కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పుంజుకునేది లేదని కేటీఆర్ అన్నారు. అందుకే.. కాక్రోచ్ జనతా పార్టీ వంటివి పుట్టుకొచ్చాయని దీనిని బట్టి జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు. యువత కూడా కాంగ్రెస్‌కు దూరమయ్యారని అన్నారు. ఇక, ఈ గ్యాప్ నేపథ్యంలోనేకేసీఆర్ జాతీయస్థాయిలో చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ కారణంగా మోసపోయిన వర్గాలన్నీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నాయని.. జాతీయ, రాష్ట్ర స్థాయిలోనూ ఇదే జరుగుతోందని కేటీఆర్ చెప్పారు. అందుకే.. కేసీఆర్ జాతీయస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారని చెప్పారు. త్వరలోనే కేటీఆర్.. నేషనల్ పాలిటిక్స్‌లోకి రానున్నట్టు వెల్లడించారు.