శంకర్ సృష్టించిన చిట్టి రోబో నిజంగానే వచ్చింది..!

సినిమాల్లో మనం ఇప్పటి వరకు చూసిన సినిమాటిక్‌ ఫిక్షన్‌ క్యారెక్టర్‌గా ఉన్న రోబోలు ఇప్పుడు నిజ జీవితంలోకి వచ్చాయి.

Update: 2026-10-24 08:37 GMT

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ఐశ్వర్య రాయ్ హీరోయిన్‌గా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన 'రోబో' సినిమా ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో చిట్టి రోబోను చూసిన సమయంలో చాలా మంది వావ్‌ నిజంగా ఇలాంటి ఒక రోబో ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నారు. ఇలాంటి రోబోలో భవిష్యత్తులో వస్తాయా, వచ్చినా మన జెనరేషన్‌ ఇలాంటి రోబోలోను చూస్తామా అనుకన్న వారు చాలా మంది ఉన్నారు. చిట్టి రోబో తరహాలో నిజ జీవితంలోనూ రోబోలు రావడానికి కనీసం నలభై.. యాబై ఏళ్ళు అవుతుందని ఆ సమయంలో కొందరు భావించారు. కానీ చాలా తక్కువ సమయంలోనే చైనా చిట్టి రోబో తరహాలో రోబోలను తయారు చేసింది. చైనాలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం కు నిదర్శనం అన్నట్లుగా ఈ రోబోలు రోడ్ల మీద విన్యాసాలు చేస్తున్నాయి. గత రెండు మూడు ఏళ్లలో చైనా రోబోటిక్‌ సైన్స్ లో అద్భుతాలు ఆవిష్కరిస్తూ వస్తుంది.

H2-X రోబో అద్భుతాలు...

సినిమాల్లో మనం ఇప్పటి వరకు చూసిన సినిమాటిక్‌ ఫిక్షన్‌ క్యారెక్టర్‌గా ఉన్న రోబోలు ఇప్పుడు నిజ జీవితంలోకి వచ్చాయి. చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్‌ సంస్థ యూనిట్రీ రోబోటిక్స్‌ వారు సరికొత్తగా అభివృద్ది చేసిన H2-X రోబో అద్భుతాలు ఆవిష్కరిస్తోంది. చిట్టి రోబో చేసినట్లు ఫైట్లు చేస్తుంది, సహాయ కార్యక్రామాల్లో పాల్గొంటుంది, ఇంకా చాలా రకాల పనులు చేస్తోంది. తాజాగా యూనిట్రీ రోబోటిక్స్‌ సంస్థ వారు విడుదల చేసిన వీడియో చూస్తూ ఉంటే, శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమాలోని సీన్స్ చూసినట్టుగా ఉంది. చిట్టి రోబో సినిమాలో ఏం చేసిందో, ఇప్పుడు H2-X రోబో అదే పని చేస్తుంది. సినిమాలో రోబో ఫీలింగ్స్ కలిగి ఉంటుంది. అది ఒక్కటి మినహా మిగిలిన అన్ని పనులు చిట్టి తరహాలోనే చేస్తుంది. H2-X రోబో కి చిట్టి రోబో మాదిరిగా ఫీలింగ్స్ కూడా కలిగితే పరిస్థితి ఏంటో అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

చైనా ఆవిష్కరించిన హ్యూమనాయిడ్‌ రోబో...

చైనా రోబో రాబోయే రోజుల్లో అద్భుతాలు ఆవిష్కరించబోతున్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రయోగం దశలో ఉండటం వల్ల స్కెలిటన్‌ మాత్రమే ఉంచారు. రజనీకాంత్‌ రోబో సినిమాలో రోబోకు ఎలా అయితే ఒక హ్యూమన్‌ ఫేస్‌ను, బాడీని అరేంజ్‌ చేశారో అలాగే ఈ రోబోలకు హ్యూన్‌ బాడీ తరహాలో ఒక ఔట్‌ ఫిట్‌ ను తయారు చేసి వేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే నిజమైన మనుషుల మాదిరిగానే ఈ రోబోలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. చైనాలో ఇప్పటికే రోబో టెక్నాలజీ పెరుగుతూ పోతుంది. ముందు ముందు చైనా రోబోటిక్ సంస్థలు ఒకరిని మించి ఒకరు అన్నట్టు రోబోలు తయారు చేసి ప్రపంచం మీద వదిలి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోబోలు అన్నీ చైనాలోనే ఉన్నాయి. వాటి పేటెంట్‌ రైట్స్‌, వాటి అమ్మకాలు మొదలు అయితే కచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా ఇవే కనిపించే అవకాశాలు ఉన్నాయి.

2050లో రోబోలు...

రాబోయే పదేళ్ల కాలంలో రోబోలు మనుషులను మించి పనులు చేస్తాయని, మనుషులు పని చేసేందుకు అసలు పని ఉండదు అని ఆ మద్య ఒక ఇంటర్వ్యూలో ఎలన్‌ మస్క్‌ అన్నాడు. చైనా తయారు చేసిన ఈ రోబోలోను చూస్తూ ఉంటే అది నిజం అవుతుందేమో అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో రోబోల తయారీకి చైనా టెక్నాలజీ సంస్థలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మరిన్ని కొత్త రోబోలు, సరికొత్త టెక్నాలజీతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. రోబో సినిమాలో అన్నట్లుగా ఎంత గొప్ప టెక్నాలజీతో వచ్చినా రోబోలు కొన్ని పనులు చేయలేవు, కనుక భవిష్యత్తు అంతా రోబోలదే అనే మాయలో పడకుండా ఉండటం మంచిదని కొందరు అంటున్నారు. మొత్తానికి హ్యూమనాయిడ్‌ రోబోలతో మనుషులు చేసే పనులు దాదాపుగా 70 నుంచి 80 శాతం తగ్గవచ్చు. 20250 వరకు రోబోలు ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతాయో కనీసం ఊహకు కూడా అందడం లేదు.

Tags:    

Similar News