ఆమెకు 30.. ఆయ‌న‌కు 75.. నిశ్చితార్థం.. రీజ‌న్ తెలిస్తే!

అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. ఎవ‌రూ దీనిని నిల‌దీయ‌లేదు. అంతా స‌వ్యంగా సాగిపోయింది. ఈ వేడుక‌కు సంబం ధించిన వీడియోల‌ను ఆ యువ‌తి సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది.

Update: 2026-10-24 09:33 GMT

ఆమెకు 30 ఏళ్లు.. ఆయ‌న‌కు 75 ఏళ్లు.. ఇద్ద‌రూ క‌లిసి నిశ్చితార్థం చేసుకున్నారు. బంధువుల స‌మ‌క్షంలోనే ఉంగ‌రా లు మార్చుకున్నారు. వేడుక‌గా విందు భోజ‌నాలు కూడా ఏర్పాటు చేశారు. దీనికి ఓ హోట‌ల్ వేదిక‌గా నిలిచింది. అయితే.. ఇంత లేటు వ‌య‌సులో ఆయ‌న‌.. ఇంత య‌వ్వ‌న ద‌శ‌లో ఉన్న ఆమె నిశ్చితార్థం చేసుకోవ‌డం ఏంట‌నే సందేహం వ‌స్తుంది. పైగా.. ఇద్ద‌రి మ‌ధ్య వ‌యో బేధం.. 45 సంవ‌త్స‌రాలు. దాదాపు కాటికి కాళ్లు చాపుకొన్న వ‌య‌సులో ఉన్న వృద్ధుడు యువ‌తితో నిశ్చితార్థానికి ఎలా ఒప్పుకొన్నాడ‌న్న సందేహం కూడా వ‌స్తుంది.

అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. ఎవ‌రూ దీనిని నిల‌దీయ‌లేదు. అంతా స‌వ్యంగా సాగిపోయింది. ఈ వేడుక‌కు సంబం ధించిన వీడియోల‌ను ఆ యువ‌తి సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. వీటికి ల‌క్ష‌ల స‌ఖ్య‌లో వ్యూస్ వ‌చ్చాయి. అదే సమ‌యంలో వేలాది కామెంట్లు కూడా కురిశాయి. దాదాపు అంద‌రూ తిట్టిపోశారు. అప్ప‌టి వ‌ర‌కు ఆమెకు స‌బ్‌స్క్రైబ ర్లుగా ఉన్న‌వారు కూడా.. దూర‌మ‌య్యారు. దీంతో అసలు సంగ‌తి ఆమెకు తెలిసింది. నెటిజ‌న్ల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధా నం చెప్ప‌లేక స‌త‌మ‌తం అయింది. దీంతో త‌న అస‌లు భ‌ర్త‌ను తిరిగి క‌లుసుకుని.. దండ‌లు మార్చుకుంది.

సోష‌ల్ మీడియా మోజులో ప‌డి.. లైకులు, వ్యూస్ కోసం.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఔర‌యా ప్రాంతానికి చెందిన రీనా రాజ్‌పు త్ చేసిన నిర్వాకం ఇది!. రీనాకు భ‌ర్త ఉన్నాడు. ఏదో చిన్న‌పాటి వివాదాలు త‌లెత్తాయి. అయినా.. వీరిద్ద‌రూ ఏమీ విడిపోలేదు. కానీ.. ఆమె అస‌లు విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి.. కుటుంబాన్ని నిలుపుకోవాల‌న్న ధ్యాస వ‌దిలేసి.. వృద్ధుడి తో నిశ్చితార్థం చేసుకుని సోష‌ల్ మీడియాలో పోస్టులు చేసింది. దీంతో నెటిజ‌న్లు మండిప‌డ్డారు. ``నీ వ‌య‌సెంత‌.. నువ్వు చేసింది.. ఏంటి?`` అని నిల‌దీశారు. మ‌రికొంద‌రు.. ఆమె వ్య‌వ‌హార శైలిని కూడా త‌ప్పుబ‌ట్టారు.

దీంతో రీనా త‌న త‌ప్పు తెలుసుకుని.. స‌ద‌రు వీడియోను డిలీట్ చేసి.. తిరిగి త‌న భ‌ర్త‌ను క‌లుసుకుని.. దండ‌లు మార్చుకుంది. ఈ వీడియోను తిరిగి సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి.. ``త‌ప్పు చేశాను క్ష‌మించండి. నా భ‌ర్త‌తోనే నా జీవితం.`` అని లెంప‌లు వేసుకుంది. దీంతో నెటిజ‌న్లు శాంతించారు. ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో రీల్స్ కోసం.. కొంద‌రు బ‌రితెగిస్తున్న విష‌యం తెలిసిందే. ఇలాంటి వాటిలో ఇది మ‌రింత దారుణంగా ఉండ‌డంతోనే నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News