• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పీకే టీమ్ పీకిందేమీ లేదు:...

పీకే టీమ్ పీకిందేమీ లేదు: సజ్జల

By - Tupaki Desk
Update: 2018-12-25 07:18 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అంటే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు దడ. ఆయన ఎప్పుడు  ఎవరి మీద జగన్ కు నెగిటివ్ గా చెబుతాడో అనే భయపడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ టీమ్ కొన్ని నెలల కిందట జగన్ తో అధికారికంగా ఒప్పందం కుదుర్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే.

వాళ్లే సర్వేలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితిని జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నారు. క్యాండిడేట్స్ తో సంబంధం లేకుండా పీకే టీమ్ సర్వేలు నిర్వహించి జగన్ కు నివేదికలను అందిస్తూ ఉంటారు. అయితే పీకే టీమ్ అంటే సజ్జల రామకృష్ణా రెడ్డికి చాలా చులకనగా ఉన్నట్టుంది. నాలుగు రోజుల క్రితం ఒక నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో పీకే టీమ్ పై సజ్జల అనుచితంగా మాట్లాడాడు అని సమాచారం.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చిన సమాచారం మేరకు.. ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం ఇన్ చార్జిగా ఉన్న నేతను అలాగే కంటిన్యూ చేయాలని వారు కోరారు. ఆయన కష్టపడ్డాడు అని, ప్రజల్లోకి వెళ్లారని.. చెప్పడంతో పాటు.. పీకే టీమ్ నిర్వహించిన సర్వేల్లో కూడా ఆ ఇన్ చార్జి కి మంచి పరిస్థితి ఉందని తేలిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

ఆ ఇన్ చార్జితో జగన్ గతంలో మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని చెప్పాడట కూడా. పీకే సర్వేల్లో నీ పరిస్థితి బాగుందని తేలిందని.. మరింత మంచి మెజారిటీని తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని జగన్ ఆ ఇన్ చార్జితో అప్పుడు సూచించాడట కూడా.

ఇదే విషయాన్ని కార్యకర్తలు సజ్జల వద్ద ప్రస్తావించారు. ఆ రిపోర్టు మీకు కూడా అందింది కదా.. అని ప్రస్తావించారు. అయితే ఆ మాటలు వినగానే సజ్జల రెచ్చిపోయాడు. పీకే టీమ్ పీకింది ఏమీ లేదు అంటూ కార్యకర్తల మీద విరుచుకుపడ్డాడు.  పీకే టీమ్ రిపోర్టును తాము పరిగణనలోకి తీసుకోవమని కూడా అన్నాడట సజ్జల. ఈ మాటలు విని వైసీపీ కార్యకర్తలు ఖిన్నులయ్యారు.

వారు మరేం మాట్లాడలేకపోయినట్టుగా తెలుస్తోంది. ‘పీకే టీమ్ పీకిందేమీ లేదు..” అనేది ఒక ఊతపదంగా వైసీపీలో ఒక చర్చ నడుస్తోంది. ఈ మాటలను సజ్జల ఏదైనా ఎక్స్ పీరియన్స్ తో అన్నాడో లేక ఆయనకు సన్నిహితులైన వారికి సర్వేల్లో నెగిటివ్  రిపోర్టులు వచ్చాయనే భావనతో ఉన్నాడో ఆయనకే తెలియాలి! అని వైసీపీ కార్యకర్తలు అన్నారు.
   

Tags:    
  • Sajjala Ramakrishna Reddy 
  • Prashant Kishor Team 
  • YSRCP 
  • Telugu NEws 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS