జాతీయవాదం అన్న మాటే వద్దంటున్న సంఘ్ పెద్దాయన

Update: 2020-02-21 06:00 GMT
కాలం సిత్రమైంది. గొప్పగా అనుకునే మాటలు కొన్నిసందర్భాల్లో బూతులుగా మారిపోతాయి. అలాంటి సమస్యే ఇప్పుడు సంఘ్ పరివార్ కు వచ్చింది. మొన్నటివరకూ జాతీయవాదం అనే మాట దేశభక్తికి కేరాఫ్ అడ్రస్ గా అన్నట్లు వ్యవహరించేవారు. ఇప్పుడా మాటను మాట వరసకు కూడా వాడొద్దంటూ సంఘ్ పరివార్ పెద్దాయనే స్వయంగా చెప్పటం వివేషం. జాతీయవాదం అనే మాటలో ఎంత బూతు ఉందో ప్రత్యేకంగా చెప్పటం షురూ చేశారు. తాజాగా ఈ పదానికి అర్థం చెబుతూ.. ఆ మాట ఎంత తప్పు ఉందో చెప్పి.. దానికి బదులుగా ఏయే పదాల్ని వాడాలో చెప్పుకొచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది.

జాతీయవాదానికి బదులుగా దేశీయ.. దేశం.. అనే మాటల్ని వాడాలన్నది ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తాజా మాట. హిందుత్వ ఎజెండాలో భాగంగానే కేంద్ర సర్కారు సీఏఏ.. ఎన్ ఆర్సీలను తీసుకొచ్చిందన్న విమర్శలు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

జాతీయవాదం అన్నది అడాల్ఫ్ హిట్లరో సిద్ధాంతాలైన నాజీయిజం.. ఫాసిజం అర్థాల్ని సూచిస్తోందన్నారు. అందుకే ఆ పదాల్ని వాడటం మానేయాలన్న ఆయన.. అందుకు బదులుగా తెర మీదకు తెచ్చిన పదాలు.. ఎంతవరకూ ఎక్కుతాయో చూడాలి. హిందూ సమాజాన్ని ఐక్యం చేయటమే సంఘ్ ధ్యేయమన్న ఆయన.. దేశ సమాఖ్య వ్యవస్థలో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోదన్నారు. మరీ.. మాటలు సంఘ్ పరివారానికి.. వారిని అభిమానించి.. ఆరాధించే వారికి ఎంతమేరకు ఎక్కుతాయో చూడాలి.


Tags:    

Similar News